Operation Sindoor: ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం..ఈ మ్యాచ్‌లు జరుగుతయా లేదా..
ABN , Publish Date - May 07 , 2025 | 03:47 PM
ఆపరేషన్ సిందూర్ కారణంగా ఐపీఎల్ 2025 సీజన్‌లో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై సందేహాలు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ ప్రస్తుతం ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ దాడి జరిగింది. ఈ ఎటాక్ నేపథ్యంలో మే 10 వరకు ఉత్తర భారత్‌లోని ప్రధాన ఎయిర్ పోర్టులలో ఫ్లైట్స్ సేవలు బంద్ ఉంటాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగా ధర్మశాలలో జరగాల్సిన పలు ఐపీఎల్ మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత సరిహద్దులోని జమ్మూ, శ్రీనగర్, లేహ్, చండీగఢ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్ వంటి విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడతాయి. ఇందులో ధర్మశాల ఎయిర్ పోర్ట్ కూడా ఉంది. ఈ పరిస్థితి ఐపీఎల్ షెడ్యూల్‌పై ప్రభావం చూపించేలా ఉంది.
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్
ఈ క్రమంలో మే 8న ధర్మశాలలో జరగనున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య షెడ్యూల్ ప్రకారం జరిగే మ్యాచ్ అవకాశం ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి. విమానాశ్రయాల మూసివేత వారి ప్రయాణ షెడ్యూల్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ, రాబోయే మ్యాచ్‌లపై ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై అనిశ్చితి
మే 11న ధర్మశాలలో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడాల్సి ఉంది. అయితే, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఈ జట్టు ఈ వారంలో ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది. విమానాశ్రయం మూసివేయబడిన నేపథ్యంలో ఈ జట్టు ప్రయాణ షెడ్యూల్‌పై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా (BCCI) కూడా ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.
నిర్ణయానికి అనుగుణంగా
ముంబై ఇండియన్స్ ఢిల్లీకి విమానంలో చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ధర్మశాలకు ప్రయాణించవచ్చని ఆయా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుందని, ఆటగాళ్లకు అసౌకర్యంగా ఉండే ఛాన్సుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ అధికారులు ప్రభుత్వ సలహాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోనున్నారు. బీసీసీఐ ఇంకా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం పంపలేదు. ముంబై ఇండియన్స్ ప్రయాణ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ విమానాశ్రయాలు తెరవకపోతే, ఈ జట్టు షెడ్యూల్ ప్రయాణాన్ని రద్దు చేయడం లేదా ఐపీఎల్ షెడ్యూల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News