New Zealand Wraps Up Zimbabwe: 3 రోజుల్లోనే ముగించారు
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:02 AM
జింబాబ్వేతో తొలి టెస్ట్‌ను మూడు రోజుల్లోనే ముగించేసిన న్యూజిలాండ్ 9 వికెట్లతో ఘన విజయం అందుకుంది.

బులవాయో: జింబాబ్వేతో తొలి టెస్ట్‌ను మూడు రోజుల్లోనే ముగించేసిన న్యూజిలాండ్ 9 వికెట్లతో ఘన విజయం అందుకుంది. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 8 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 31/2తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే 165 రన్స్‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 149, కివీస్ 307 పరుగులు చేశాయి.