Neeraj Chopra: జావెలిన్ విప్లవానికి నాంది..
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:50 AM
బెంగళూరు తన పేరిట శనివారం ఇక్కడ జరుగనున్న క్లాసిక్ ఈవెంట్ దేశంలో జావెలిన్ త్రో విప్లవానికి నాంది పలకగలదన్న ఆశాభావాన్ని నీరజ్ వ్యక్తంచేశాడు.

బెంగళూరు తన పేరిట శనివారం ఇక్కడ జరుగనున్న క్లాసిక్ ఈవెంట్ దేశంలో జావెలిన్ త్రో విప్లవానికి నాంది పలకగలదన్న ఆశాభావాన్ని నీరజ్ వ్యక్తంచేశాడు. ఇక్కడి కంఠీరవ స్టేడియంలో ఈ పోటీ జరగనుంది. భవిష్యత్ భారత జావెలిన్ త్రోయర్లలో ఈ టోర్నీ స్ఫూర్తి నింపుతుందని నమ్ముతున్నాడు. నీరజ్‌తోపాటు మరో ఇద్దరు ఒలింపిక్ పతక విజేతలు థామస్ రోలెర్, జూలియస్ ఎగో పోటీ బరిలో దిగుతున్నారు. భారత్ నుంచి చోప్రాతోపాటు రోహిత్ యాదవ్, సాహిల్ సిల్వాల్, జస్వీర్ సింగ్ తలపడుతున్నారు. మొత్తం 12 మంది త్రోయర్లు ఈ ఈవెంట్ బరిలో నిలిచారు.