Share News

MS Dhoni vs Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్

ABN , Publish Date - May 29 , 2025 | 11:17 AM

భారత ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ టామ్ మూడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

MS Dhoni vs Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్
MS Dhoni IPL captain

ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ.. రోహిత్ శర్మ.. ఇద్దరూ ఇద్దరే. అద్భుత ఆటతీరుతో ఈ దిగ్గజ ప్లేయర్స్ టీమిండియాకు అనేక విజయాలను అందించారు. ఐపీఎల్‌లో కూడా తమ తమ జట్లను పలుమార్లు విజయతీరాలకు చేర్చారు. దీంతో, సహజంగానే ఇద్దరి పర్‌ఫార్మెన్స్‌ను అభిమానులు పోల్చి చూస్తుంటారు. మరి ఈ ఇద్దరిలో ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ ఎవరనేదానిపై మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీంతో, ఈ అంశం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుత కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ అని టామ్ మూడీ స్పష్టం చేశాడు. అతడికి తిరుగేలేదని పేర్కొన్నాడు. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ కూడా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచాడు. అయితే, రోహిత్ కంటే ధోనీకే తాను ఎక్కువ మార్కులు వేస్తానని టామ్ మూడీ అన్నాడు.


‘ధోనీ సారథ్యంలో జట్టు అత్యధిక విజయాలు అందుకున్న మాట వాస్తవమే అయితే, అనేక సందర్భాల్లో అతడు అత్యంత సాధారణంగా ఉన్న జట్టును కూడా విజయతీరాలకు చేర్చాడు’ అని మూడీ అన్నారు. ఐపీఎల్ కెప్టెన్‌లలో విరాట్‌ని నెం.5గా, గౌతమ్ గంభీర్‌‌ను నెం.3గా, శ్రేయస్ అయ్యర్‌ను నెం.4గా పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌‌కు నెం.5 స్థానాన్ని ఇచ్చాడు.

తాజా సీజన్‌లో మాత్రం జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైనా మోచేతి గాయం కారణంగా మధ్యలోనే తప్పు కోవాల్సి వచ్చింది. దీంతో, మరోసారి ధోనీ జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టాడు. కానీ, ఈసారి మాత్రం సీఎస్‌కే ఘోరంగా విఫలమైంది. చరిత్రలో తొలిసారిగా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.


బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థిరత్వం కోసం ధోనీ టాప్ ఆర్డర్‌లో బరిలోకి దిగకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లో ధోనీ కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. పట్టిందల్లా బంగారం అవుతుందన్న పేరున్న ధోనీకి ఈసారి అదృష్టం కూడా కలిసి రాలేదు. కేవలం 4 గెలుపులతో సీజన్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీ ముందున్న అతిపెద్ద సవాలు అదే: స్టీవ్ వా

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా సభ్యుల ఎంపికపై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 01:12 PM