Share News

KL Rahul: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్..టీ20లో అరుదైన ఘనత

ABN , Publish Date - May 18 , 2025 | 08:56 PM

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్(KL Rahul) సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.

KL Rahul: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్..టీ20లో అరుదైన ఘనత
KL Rahul Breaks Virat Kohlis Record

2025 ఐపీఎల్ 18వ సీజన్ సందర్భంగా మరో అరుదైన రికార్డ్ నమోదైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆటకు దిగిన కేఎల్ రాహుల్ (KL Rahul) 33 పరుగులు చేసిన వెంటనే, అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో రాహుల్ భారతదేశం తరపున 8 వేల T20 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించడం విశేషం.


చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

విరాట్ 243 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. కానీ ఇప్పుడు కేఎల్ రాహుల్ 224 ఇన్నింగ్స్‌లలో 8000 పరుగులు పూర్తి చేయడం ద్వారా విరాట్ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో 8 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆరో భారతీయుడిగా కేఎల్ రాహుల్ ఘనతను సాధించాడు. దీంతో, టీ20 క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 8 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కేఎల్ రాహుల్ మూడో స్థానానికి చేరుకున్నాడు. అతని కంటే ముందు బాబర్ ఆజం, క్రిస్ గేల్ ఉన్నారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 213 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. బాబర్ ఆజం 218 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను అందుకున్నాడు.

T20లో అత్యంత వేగంగా 8000 పరుగులు (ఇన్నింగ్స్ వారీగా)

  • 213 - క్రిస్ గేల్

  • 218- బాబర్ అజామ్

  • 224 - కేఎల్ రాహుల్*

  • 243-విరాట్ కోహ్లీ

  • 244-మహమ్మద్ రిజ్వాన్


కేఎల్ రాహుల్ సెంచరీ..

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న 60వ మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆ క్రమంలో డు ప్లెసిస్‌ 10 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను ఔటైన తర్వాత, అభిషేక్ పోరెల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ వార్త రాసే సమయానికి, కేఎల్ రాహుల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో 112 పరుగులు చేశాడు. వీటిలో 14 ఫోర్లు ఉండగా, నాలుగు సిక్సులు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్


Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..


EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 18 , 2025 | 09:35 PM