New Zealand Cricket Team: కివీస్ రెండో విజయం
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:23 AM
ముక్కోణపు టీ20 సిరీ్‌సలో న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది.

హరారే: ముక్కోణపు టీ20 సిరీ్‌సలో న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో ఆతిథ్య జింబాబ్వేను ఓడించింది. తొలుత జింబాబ్వే 20 ఓవర్లలో 120/7 స్కోరుకే పరిమితమైంది. మధెవెరె (36), బెన్నెట్ (21) మాత్రమే రాణించారు. మ్యాట్ హెన్రీ (3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. స్వల్ప ఛేదనను కివీస్ 13.5 ఓవర్లలో 122/2 స్కోరుతో పూర్తి చేసింది. కాన్వే (59 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయగా, రచిన్ (30) సత్తా చాటాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో న్యూజిలాంట్ టాప్‌లో నిలిచింది. దక్షిణాఫ్రికా (2 పాయింట్లు) ఆ తర్వాతి స్థానంలో నిలవగా, జింబాబ్వే పాయింట్ల ఖాతా తెరవలేదు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి