Kamindu Mendis Catch: కమిందు ఆల్‌రౌండ్‌షో
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:14 AM
కమిందు మెండిస్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించాడు.బ్రెవిస్ క్యాచ్, జడేజా వికెట్, మ్యాచ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

కమిందు మెండిస్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్, బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో భారీ షాట్లతో దూసుకెళుతున్న బ్రెవిస్ అతడి సూపర్ క్యాచ్‌తోనే వెనుదిరిగాడు. గోల్‌కీపర్ బంతిని అందుకునే తరహాలో కమిందు 11.09 మీటర్ల దూరం పరిగెత్తి తన ఎడమవైపునకు సమాంతరంగా డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను పట్టేయడం హైలైట్‌గా నిలిచింది. ఇక బ్యాటింగ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చివరి దాకా నిలిచి విజయాన్ని అందించాడు. అలాగే బౌలింగ్‌లో జడేజా వికెట్ పడగొట్టాడు.