National Athletics Championship 2025: నందిని, జ్యోతికి స్వర్ణాలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:30 AM
తెలుగమ్మాయిలైన యర్రాజి జ్యోతి, అగసర నందిని జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించారు. వీరిద్దరూ ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత పొందారు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగమ్మాయిలు యర్రాజి జ్యోతి, అగసర నందిని జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలతో మెరిశారు. ఈ ప్రదర్శనతో వీళ్లిద్దరు.. వచ్చేనెల కొరియాలో జరిగే ఆసియా చాంపియన్‌షి్‌ప్సకు అర్హత సాధించారు. మంగళవారం కొచ్చిలో జరిగిన ఈ పోటీల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి 13.23 సెకన్లలో రేసు పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. హెప్టాథ్లాన్‌లో నందిని 5813 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. పోల్‌వాల్ట్‌లో దేవ్ కుమార్ మీనా జాతీయ రికార్డును బద్దలుకొట్టి స్వర్ణం గెలిచాడు. మహిళల 400 మీటర్ల పరుగులో రూపల్ చౌధురి, పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజాస్ అశోక్ స్వర్ణాలు నెగ్గారు.