Share News

World Cup 2025: వరల్డ్ కప్‌-2025లో భారత్‌కు తొలి ఓటమి

ABN , Publish Date - Dec 04 , 2025 | 07:33 AM

జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో జర్మనీ జట్టు చేతిలో భారత్‌ 1–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

World Cup 2025: వరల్డ్ కప్‌-2025లో భారత్‌కు తొలి ఓటమి
India vs Germany Hockey

ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ కప్-2025లో భారతకు తొలి పరాజయం ఎదురైంది. జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం జర్మనీ , భారత్(India vs Germany Hockey) తలపడ్డాయి. గ్రూప్-సి లో జరిగిన ఈ లీగ్ మ్యాచ్ లో భారత్ 1-3 గోల్స్ తేడాతో జర్మనీ(Germany Beats India 3-) చేతిలో ఓడింది. ఇండియా తరఫున హీనా బానూ మాత్రమే 58వ నిమిషంలో ఒక్కే ఒక గోల్ చేసింది. ఆ తర్వాత ఎవరూ కూడా గోల్ సాధించక లేకపోయారు. మరోవైపు జర్మనీ జట్టుకు లీనా ఫ్రెరిచ్స్ 5వ నిమిషంలో, అనిక షానాఫ్ 52వ నిమిషంలో, మార్టినా రీసెంగర్ 59వ నిమిషంలో తలో గోల్ అందించారు. అలానే మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. అయితే ఒక పెనాల్టీని మాత్రమే సద్వినియోగం చేసుకుంది.


మరోవైపు జర్మనీ జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ లభించాయి. వాటిల్లో మూడిటిని జర్మనీ జట్టు సద్వినియోగం చేసుకుంది. మ్యాచ్ చివరి పది నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత్‌(Hockey India) పట్టుకోల్పోయి రెండు గోల్స్‌ సమర్పించుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘సి’లో జర్మనీ(Germany) ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. నమీబియాపై మాత్రమే గెలిచిన భారత్, ఐర్లాండ్‌ జట్లు మూడు పాయింట్లతో సమానంగా ఉన్నాయి.


పాయింట్ల పట్టికలో +11 గోల్ డిఫరెన్స్ తో భారత్ రెండో స్థానంలో ఉంది. -3 గోల్ ఢిపరెన్స్ తో ఐర్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇక భారత్ రేపు జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌(India vs Ireland)తో తలపడుతుంది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. తొలిసారి 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీలో ఆరు గ్రూప్‌లు చేశారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు.


ఇవి కూడా చదవండి:

Kohli ODI century: సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా..

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 04 , 2025 | 10:52 AM