Sarvagya Kushwaha: ఫిడే రేటెడ్ ప్లేయర్‌గా మూడేళ్ల చిన్నారి రికార్డు
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:08 AM
మధ్యప్రదేశ్‌కు చెందిన సర్వగ్యసింగ్ కుష్వాహ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఫిడే రేటెడ్ ప్లేయర్‌గా గుర్తింపు పొంది చరిత్ర సృష్టించాడు. మూడు సంవత్సరాల ఏడు నెలల, 20 రోజుల్లో...
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన సర్వగ్యసింగ్ కుష్వాహ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఫిడే రేటెడ్ ప్లేయర్‌గా గుర్తింపు పొంది చరిత్ర సృష్టించాడు. మూడు సంవత్సరాల ఏడు నెలల, 20 రోజుల్లో ఫిడే రేటింగ్ సాధించిన పిన్న క్రీడాకారుడిగా సర్వగ్య రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు బెంగాల్‌కు చెందిన అనీష్ సర్కార్ మూడేళ్ల 8 నెలల వయసులో ఈ రికార్డు నెలకొల్పాడు. వాస్తవానికి సర్వగ్య ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలను ఎక్కువగా చూస్తుండడంతో వాటి నుంచి దృష్టి మరల్చేందుకు అతడి తల్లిదండ్రులు చెస్‌ను నేర్పించడం మొదలుపెట్టారు. అలా చెస్ ప్రయాణం ప్రారంభించిన ఈ చిన్నారి ఆరు నెలలు తిరిగేసరికి ప్రొఫెషనల్ క్రీడాకారులను ఓడించడం విశేషం. ప్రస్తుతం ఈ బుడ్డోడి ఖాతాలో 1572 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఫిడే రేటింగ్ సాధించాలంటే ఒక అంతర్జాతీయ ప్లేయర్ ఓడించాల్సి ఉంది. అయితే సర్వగ్య ఏకంగా ముగ్గురు క్రీడాకారులను ఓడించి సంచలనం సృష్టించాడు.
ఇవి కూడా చదవండి:
ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!
ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ