Indian Cricketers Achievements: బుమ్రా మంధానకు విజ్డెన్ అవార్డులు
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:44 AM
జస్‌ప్రీత్ బుమ్రా పురుషుల విభాగంలో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో స్మృతి మంధానకు ఈ గౌరవం లభించింది

లండన్: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు దక్కింది. గతేడాది పురుషుల క్రికెట్‌లో ప్రదర్శన ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. మొత్తం మూడు ఫార్మాట్లలో బుమ్రా 86 వికెట్లు తీశాడు. వెస్టిండీ్‌సలో జరిగిన టీ20 వరల్డ్‌క్‌పలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగానూ నిలిచిన విషయం తెలిసిందే. గతంలో భారత్ నుంచి సచిన్, సెహ్వాగ్, విరాట్ కోహ్లీలకు ఈ పురస్కారం దక్కింది. ఇక, మహిళల క్రికెట్‌లో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన లీడింగ్ క్రికెటర్‌గా అవార్డుకు ఎంపికైంది. గతేడాది ఆమె అన్ని ఫార్మాట్లలో కలిపి 1659 పరుగులు చేసి టాప్‌లో నిలిచింది. ఇక టీ20 ఫార్మాట్‌లో లీడింగ్ క్రికెటర్‌గా విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ప్రకటించారు. 21 టీ20ల్లో అతను 464 పరుగులు సాధించాడు.