Share News

India Football Coach: జాతీయ ఫుట్‌బాల్‌ కోచ్‌ జమీల్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:57 AM

సుదీర్ఘకాలం తర్వాత భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ప్రధాన కోచ్‌గా మన దేశానికే చెందిన వ్యక్తి నియమితుడయ్యాడు.

India Football Coach: జాతీయ ఫుట్‌బాల్‌ కోచ్‌ జమీల్‌

చాన్నాళ్ల తర్వాత ఓ భారతీయుడి నియామకం

న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం తర్వాత భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ప్రధాన కోచ్‌గా మన దేశానికే చెందిన వ్యక్తి నియమితుడయ్యాడు. 48 ఏళ్ల ఖాలిద్‌ జమీల్‌ను కోచ్‌గా ఎంపిక చేసినట్టు భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) శుక్రవారం వెల్లడించింది. స్టీఫెన్‌ కాన్‌స్టాంటిన్‌ (ఇంగ్లండ్‌), స్టెపాన్‌ తర్కోవిచ్‌ (స్లొవేకియా)లను వెనక్కినెట్టి జమీల్‌ ఈ పదవి దక్కించుకున్నాడు. స్పెయిన్‌కు చెందిన మార్క్వెజ్‌ రాజీనామా చేయడంతో ఫుట్‌బాల్‌ కోచ్‌ పదవి ఖాళీ అయ్యింది. కువైట్‌లో జన్మించిన జమీల్‌ గల్ఫ్‌ యుద్ధం (1990-91) సమయంలో కుటుంబంతో ముంబై వచ్చి స్థిరపడ్డాడు. దిగ్గజ ఫుట్‌బాలర్‌ బైచుంగ్‌ భూటియా సమకాలికుడైన జమీల్‌ 1997లో బంగ్లాదేశ్‌పై శాఫ్‌ కప్‌ మ్యాచ్‌ ద్వారా జాతీయ జట్టుకు అరంగేట్రం చేశాడు.

పసిడి పోరుకు భారత రెజ్లర్‌

  • అండర్‌-17 ప్రపంచ చాంపియన్‌షిప్‌

ఏథెన్స్‌ (గ్రీస్‌): భారత యువ రెజ్లర్‌ ల్యాకీ అండర్‌-17 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఫైనల్‌ చేరాడు. 110 కిలోల విభాగం సెమీఫైనల్లో ల్యాకీ 15-7తో అమీర్‌హుస్సేన్‌ (ఇరాన్‌)ను చిత్తుచేసి పసిడి పోరులో ప్రవేశించాడు.

Updated Date - Aug 02 , 2025 | 03:57 AM