Share News

James Anderson: కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!

ABN , Publish Date - Dec 13 , 2025 | 06:51 AM

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ 43 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా నియమితుడై రికార్డు సృష్టించాడు. రానున్న కౌంటీ ఛాంపియన్స్‌షిప్‌లో అండర్సన్ లాంకాషైర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

James Anderson: కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!
James Anderson

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్స్ సంచలన రికార్డు సృష్టించాడు. 43 వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. రానున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకాషైర్ జట్టుకు అండర్సన్ నియమితుడయ్యాడు. 2002లో లాంకాషైర్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అండర్సన్.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే రిటైర్ అయ్యాక కూడా అండర్సన్(James Anderson) కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. గత సీజన్‌లో తాత్కాలికంగా జట్టుకు నాయకత్వం వహించిన ఆయన.. నవంబర్‌లో మరో ఏడాది ఒప్పందంపై సంతకం చేశాడు. కాగా ఈ సారి శాశ్వత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.


ఈ విషయంపై అండర్సన్ మాట్లాడాడు. ‘లాంకాషైర్‌కు నేతృత్వం వహించడం నాకు గొప్ప గౌరవం. అనుభవజ్ఞుల సమ్మేళనం ఉన్న లాంకాషైర్ జట్టుతో కలిసి డివిజన్ వన్‌కు ప్రమోషన్ సాధించడమే నా ప్రధాన లక్ష్యం. నా నాయకత్వంలో జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందనే నమ్మకం ఉంది’ అని అండర్సన్ తన నియామకంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ తరఫున 188 టెస్టుల్లో 704 వికెట్లు తీసిన అండర్సన్.. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. జేమ్స్ అండర్సన్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్ 2026 ఏప్రిల్ 3న నార్తాంప్టన్షైర్‌తో అవేగ్రౌండ్‌లో ప్రారంభం కానుంది.


ఇవీ చదవండి:

పేలవ ప్రదర్శన.. సూర్యకు అసలు ఏమైంది?

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌పై తొలి జట్టుగా..!

Updated Date - Dec 13 , 2025 | 06:51 AM