Share News

IPL 2025 Win Prediction: నేడు ఢిల్లీ vs ముంబై కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - May 21 , 2025 | 07:46 AM

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు (మే 21న) ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్ (IPL 2025 Win Prediction) జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే, ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. కానీ ముంబై ఓడిపోతే, ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి దానికి మరో ఛాన్స్ ఉంటుంది.

IPL 2025 Win Prediction: నేడు ఢిల్లీ vs ముంబై కీలక మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

ఐపీఎల్ 2025లో 63వ మ్యాచ్ నేడు (మే 21, 2025న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా డూ ఆర్ డై అని చెప్పవచ్చు. వాస్తవానికి, ఈ సీజన్‎లో మూడు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఇక మిగిలిన చివరి స్థానం కోసం ముంబై, ఢిల్లీ మధ్య ఈరోజు కీలక పోరు కొనసాగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది ప్లేఆఫ్స్‌కు (IPL 2025 Win Prediction) చేరుకునే అవకాశాలను ఎక్కువగా ఉంటాయి.


వాంఖడే పిచ్ పరిస్థితి ఎలా

వాంఖడే స్టేడియం పిచ్ ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్లకు సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా అనేక జట్లు ఇక్కడ అధిక స్కోరింగ్‌ చేస్తాయి. ఇక్కడ స్పిన్నర్లకు పెద్దగా సపోర్ట్ లభించదని నిపుణులు చెబుతున్నారు. ఈ మైదానంలో లక్ష్యాన్ని ఛేదించే జట్టు ఎక్కువ విజయాలు సాధించింది. కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడతాడు. దీంతో వాంఖడేలో టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

వాంఖడే స్టేడియం గణాంకాలు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 122 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 56 సార్లు గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు 66 మ్యాచ్‌ల్లో గెలిచింది. అందుకే ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడానికి ఇష్టపడుతుంది. ఐపీఎల్‌లో ఈ మైదానం అత్యధిక స్కోరు గురించి చెప్పాలంటే, ఇది 1 వికెట్‌కు 235 పరుగులు. ఈ స్కోరును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2015లో చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యల్ప స్కోరు చేసిన రికార్డును కలిగి ఉంది. 2015లో ఈ జట్టు 67 పరుగులకే ఆలౌట్ అయింది.


విన్ ప్రిడిక్షన్ ఎలా..

ముంబై బలమైన పునరాగమనం చేసి ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాల్లో నిలిచింది. ఢిల్లీకి మంచి ఆరంభం లభించింది. కానీ ఈ జట్టు గత ఆరు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుకు సాగాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఈ క్రమంలో రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌లను పంజాబ్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది. అయితే గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే మాత్రం ఈ మ్యాచులో ముంబై జట్టు గెలిచేందుకు 63 శాతం అవకాశం ఉండగా, ఢిల్లీ జట్టుకు 37 శాతం ఛాన్సుంది.


ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనా

ముంబై ఇండియన్స్: ర్యాన్ రికిల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రరాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్.


ఇవీ చదవండి:

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..


Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 12:09 PM