India vs Australia 5th T20: అందుకే తిలక్‌ను పక్కన పెట్టాం: సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:50 PM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ కు తిలక్ వర్మను భారత్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఎంపిక చేయలేదు. అందుకు గల కారణాలను ఆయన వెల్లడించారు. అలాగే ఈ మ్యాచ్ లో టాస్ ఓడటంపై కూడా భారత్ కెప్టెన్ స్పందించాడు.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లోనూ భారత్(India) టాస్ ఓడింది. బ్రిస్బేన్(Brisbane T20)లోని గబ్బా స్టేడియం వేదికగా ఇవాళ(శనివారం నాడు) జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అని ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్( Mitchell Marsh) అన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ కు తిలక్ వర్మను భారత్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) ఎంపిక చేయలేదు. అందుకు గల కారణాలను సూర్య వెల్లడించారు. ముందుగా టాస్ ఓడటంపై కూడా భారత్ కెప్టెన్ స్పందించాడు.
సూర్య మాట్లాడుతూ... 'మ్యాచ్‌లు ఓడిపోనంత వరకు టాస్ ఓడినా పోయిదేం ఏం లేదు. టాస్‌తో సంబంధం లేకుండా మేం సత్తా చాటాలనుకుంటున్నాం. ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడం ఎప్పుడైనా మంచిదే. అదే సమయంలో ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగాలనేది కూడా ప్రధానమైనది. పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్లు మినహా ప్రతీ ప్లేయర్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి. చివరి టీ20 కోసం ఆడే తుది జట్టులో ఒక చిన్న మార్పు చేశాము. తిలక్ వర్మ(Thilak varma)కు విశ్రాంతి ఇచ్చి.. రింకూ సింగ్‌ను తీసుకున్నాము. రింకూకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము' అని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav) చెప్పుకొచ్చాడు.
ఐదు టీ20 మ్యాచుల సిరీస్(IND vs AUS live)లో భాగంగా ఇప్పటికే 2-1తో భారత్ ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి మ్యాచ్ కూడా గెలిచి విజేతగా నిలవాలనుకుంటుంది. మరోవైపు ఆసీస్ సిరీస్ సమం చేయడంపై ఫోకస్ పెట్టింది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ఆటం కలిగిస్తుంది. ఆట నిలిచే సమయానికి 4.5 ఓవర్లకు భారత్ ఒక వికెట్ కూడ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(Abhishek Sharma)(23*), శుభ్ మన్ గిల్(29*) క్రీజ్ లో ఉన్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. సిరీస్ ను గెలవాలనే పట్టుదల భారత్ ఓపెనర్లలో కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
పెళ్లి తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడు: కైఫ్
భారీ రికార్డుకు చేరువలో బుమ్రా
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి