India vs England Womens Cricket: సిరీస్ లక్ష్యంగా..
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:11 AM
తొలి వన్డే విజయంతో జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు ఇప్పుడు సిరీ్‌సపై కన్నేసింది

లండన్: తొలి వన్డే విజయంతో జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు ఇప్పుడు సిరీ్‌సపై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో శనివారం ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీ్‌సను హర్మన్‌ప్రీత్ సేన 3-2తో గెలిచిన విషయం తెలిసిందే. అలాగే శ్రీలంక, దక్షిణాఫ్రికాలతో మేలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ను సైతం గెలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వన్డే వరల్డ్‌క్‌పనకు కూడా ఈ సిరీస్ విజయం చక్కటి సన్నాహకం కానుంది. పేసర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ జట్టులో లేకపోయినా బౌలింగ్ విభాగం రాణించగలుగుతోంది. క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డిలతో పాటు స్పిన్నర్లు శ్రీచరణి, స్నేహ్ రాణా విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక తొలి వన్డేలో భారత బ్యాటింగ్ విభాగం కలిసికట్టుగా రాణించింది. కెప్టెన్ హర్మన్ నిరాశపర్చినా ఓపెనర్లు ప్రతికా రావల్, మంధానతో పాటు మిడిలార్డర్‌లో జెమీమా, దీప్తి శర్మ కీలకంగా నిలిచారు. చివర్లో అమన్‌జోత్ హిట్టింగ్‌తో చెలరేగడం జట్టుకు లాభించేదే. అటు ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ చావోరేవో కాబట్టి లార్డ్స్‌లో గెలిచి తీరాలనే కసితో బరిలోకి దిగనుంది. జట్టు మిడిలార్డర్ ఫర్వాలేదనిపించినా టాపార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. నేటి పోరులో అన్ని విభాగాల్లో రాణించి ప్రత్యర్థిని కట్టడి చేయడంతో పాటు సిరీ్‌సలోనూ నిలవాలని సివర్ బ్రంట్ బృందం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి