India vs SA 1st ODI: టీమిండియా గెలుపు.. పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా..
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:57 PM
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతమైన పోరాటం చేసి 332 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ నాలుగు, హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు.
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతమైన పోరాటం చేసి 332 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ నాలుగు, హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. మిడిలార్డర్ బ్యాటర్ మాథ్యూ (72), మార్కో యన్‌సెన్ (70), బాష్ (67) పోరాడినా దక్షిణాఫ్రికాను గెలిపించలేకపోయారు (Harshit Rana wickets).
టీమిండియా నిర్దేశించిన 350 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదెన్ మార్‌క్రమ్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్, క్వింటెన్ డికాక్ పరుగులేమీ చేయకుండానే హర్షిత్ రాణా బౌలింగ్‌లో అవుటయ్యారుడు. ఆ దశలో మాథ్యూ, టోనీ జోర్జీ (39) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు (India vs South Africa match). ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు (IND SA highlights). టోనీని వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్రావిస్ (37) కూడా మాథ్యూకు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు.
బ్రావిస్‌ను హర్షిత్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన యన్‌సెన్ అద్భుతంగా ఆడి దక్షిణాఫ్రికాను విజయానికి చేరువ చేశాడు. 39 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. మాథ్యూతో కలిసి 97 పరుగులు జోడించాడు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటవడం సఫారీ జట్టును దెబ్బ తీసింది. చివర్లో బాష్ (67) వీరోచిత పోరాటం చేసి భారత్‌ను భయపెట్టాడు. చివరకు దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. కేవలం 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3, అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశాడు.
ఇవి కూడా చదవండి:
టాస్‌లో అరుదైన రికార్డు సృష్టించిన భారత్.. ఏకంగా 19 సార్లు
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. వన్డేలో తొలి ప్లేయర్‌గా