Share News

Asia Cricket: బంగ్లాదేశ్‌లో భారత పర్యటన లేనట్టే

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:43 AM

బంగ్లాదేశ్‌లో భారత క్రికెట్‌ జట్టు పర్యటన రద్దు కానుంది.

Asia Cricket: బంగ్లాదేశ్‌లో భారత పర్యటన లేనట్టే

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో భారత క్రికెట్‌ జట్టు పర్యటన రద్దు కానుంది. ఆ దేశంలో ఏడాది కాలంగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో టీమిండియా పర్యటన దాదాపు లేనట్టేనని బీసీసీఐ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఆగస్టు 17 నుంచి 31 వరకు జరగాల్సిన ఈ పర్యటనలో భారత్‌-బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, మూడు వన్డేలలో తలపడాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్‌లో ఆడే మ్యాచ్‌ల ద్వారా లభించే పాయింట్లు వన్డే ప్రపంచ కప్‌నకు అర్హత సాధించేందుకు కీలకం కావడంతో .భారత పర్యటన పూర్తిగా రద్దు కావడంలేదు. వచ్చే ఏడాది ఆ టూర్‌ జరిగే అవకాశముందని ఆయన వివరించారు.

Updated Date - Jul 05 , 2025 | 03:43 AM