Share News

IND vs SA: హర్షిత్ రాణా విజృంభణ.. కష్టాల్లో దక్షిణాఫ్రికా..

ABN , Publish Date - Nov 30 , 2025 | 07:57 PM

రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి వైపు పయనిస్తోంది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు.

IND vs SA: హర్షిత్ రాణా విజృంభణ.. కష్టాల్లో దక్షిణాఫ్రికా..
Harshit Rana bowling

రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి వైపు పయనిస్తోంది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. మిడిలార్డర్ బ్యాటర్ మాథ్యూ (54 నాటౌట్) మాత్రమే పోరాడుతున్నాడు (Harshit Rana wickets).


టీమిండియా నిర్దేశించిన 350 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదెన్ మార్‌క్రమ్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్, క్వింటెన్ డికాక్ పరుగులేమీ చేయకుండానే హర్షిత్ రాణా బౌలింగ్‌లో అవుటయ్యారుడు. ఆ దశలో మాథ్యూ, టోనీ జోర్జీ (39) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు (India vs South Africa match).


ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు (IND SA highlights). టోనీని వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్రావిస్ (37) కూడా మాథ్యూకు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. బ్రావిస్‌ను హర్షిత్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 25 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 188 పరుగుల దూరంలో ఉంది. 25 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. మాథ్యూను త్వరగా అవుట్ చేస్తే టీమిండియా విజయం లాంఛనంగానే కనబడుతోంది.


ఇవి కూడా చదవండి:

టాస్‌లో అరుదైన రికార్డు సృష్టించిన భారత్.. ఏకంగా 19 సార్లు

రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. వన్డేలో తొలి ప్లేయర్‌గా

Updated Date - Nov 30 , 2025 | 07:57 PM