Share News

Hyderabad vs Delhi Prediction: నేడు హైదరాబాద్ vs ఢిల్లీ మధ్య 55వ మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఇలా ..

ABN , Publish Date - May 05 , 2025 | 08:19 AM

నేడు ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుంది, గత రికార్డులు ఎలా ఉన్నాయ్ అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Hyderabad vs Delhi Prediction: నేడు హైదరాబాద్ vs  ఢిల్లీ మధ్య 55వ మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఇలా ..
Hyderabad vs Delhi Prediction

ఐపీఎల్ 2025లో నేడు(మే 5న) 55వ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడనుంది. 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలతో దాదాపు ప్లేఆఫ్ రేసుకు దూరంగా ఉన్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచులో గెలుస్తుందో లేదో చూడాలి మరి. ఆరెంజ్ ఆర్మీకి ఈ సీజన్ సెట్ కాలేదు. టాప్ ఆర్డర్, ఫాస్ట్ బౌలింగ్ ఫాంం‌తో ఇబ్బంది పడుతుంది. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు తమ ప్రత్యర్థి జట్టు గట్టి పోటీ ఇవ్వాలని ఆశిస్తోంది.


ఢిల్లీ జట్టు..

మరోవైపు ఢిల్లీ జట్టు గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. టోర్నమెంట్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో మొదటి నాలుగు స్థానాల్లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని జట్టు ప్రత్యర్థిని ఓడించడానికి విభిన్న వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ సీజన్‌లో చివరిసారిగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు, క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం విషయం.

విన్ ప్రిడిక్షన్

ఇప్పటివరకు ఈ రెండు జట్లు 25 ఐపీఎల్ ఆటల్లో ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఆ క్రమంలో SRH 13 సార్లు గెలువగా, DC 12 సార్లు గెలిచింది. హైదరాబాద్.. హెడ్ టు హెడ్ లో కొంచెం ముందంజలో ఉన్నప్పటికీ, గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిచేందుకు 53 శాతం ఛాన్సుందని తెలిపింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి కేవలం 47 శాతమే అవకాశం ఉంది.


పిచ్ రిపోర్ట్

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైన పిచ్‌గా పరిగణిస్తారు. ఇక్కడ బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా పరుగులు సాధిస్తారు. అయితే ఫాస్ట్ బౌలర్లకు ఇక్కడ సపోర్ట్ లభిస్తుంది. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు 180 కంటే ఎక్కువే ఉండవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా:

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 అంచనా:

అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్


ఇవి కూడా చదవండి:

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం


Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..


Virat Kohli: ఆరెంజ్ క్యాప్‌ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..


Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 08:19 AM