Share News

Hardik Pandya: అవును.. హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్ చేశా.. నటి ఈషా గుప్తా సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jun 25 , 2025 | 08:07 PM

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా డేటింగ్‌లో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై అటు హార్దిక్, ఇటు ఈషా గుప్తా స్పందించలేదు. ఆ తర్వాత హార్దిక్ వేరే యువతిని వివాహం చేసుకుని ఆమె నుంచి కూడా విడిపోయాడు.

Hardik Pandya: అవును.. హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్ చేశా.. నటి ఈషా గుప్తా సంచలన వ్యాఖ్యలు..
Esha gupta breaks silence about dating with Hardik pandya

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా (Esha gupta) డేటింగ్‌లో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై అటు హార్దిక్, ఇటు ఈషా గుప్తా స్పందించలేదు. ఆ తర్వాత హార్దిక్ నటాషా అనే యువతిని వివాహం చేసుకుని ఆమె నుంచి కూడా విడిపోయాడు. కాగా, హార్దిక్‌తో డేటింగ్ ప్రచారంపై తాజాగా ఈషా గుప్తా స్పందించింది. తాను గతంలో హార్దిక్‌తో డేటింగ్ (Dating) చేసినట్టు అంగీకరించింది. అయితే తమది పూర్తి స్థాయి డేటింగ్ కాదని తెలిపింది.


'మా ఇద్దరి మధ్య గతంలో స్నేహం ఉంది. కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాం. మేమిద్దరం పూర్తి స్థాయి డేటింగ్ చేశామని చెప్పలేను. మా స్నేహం ప్రారంభమైనప్పుడే మా రిలేషన్ ముందుకు వెళ్లవచ్చు లేదా అక్కడితో ఆగిపోనూ వచ్చు అనుకున్నాం. అయితే మేం ఓ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టే ముందే మేం విడిపోయాం. కొన్ని నెలల పాటే మా అనుబంధం కొనసాగింది. ఆ సమయంలో రెండు, మూడు సార్లు కలిశాం. ఆ తర్వాత విడిపోయాం' అని ఈషా గుప్తా చెప్పుకొచ్చింది. తమది పూర్తి స్థాయి డేటింగ్ అని చెప్పలేం అని తెలిపింది.


కాగా, కొన్ని రోజుల క్రితం కేఎల్ రాహుల్‌తో కలిసి హార్దిక్ పాండ్యా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో మహిళల గురించి హార్దిక్ చేసిన అసభ్యకర కామెంట్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ కామెంట్లపై కూడా తాజాగా ఈషా గుప్తా స్పందించింది. హార్దిక్ చేసిన ఆ కామెంట్లు తననేం బాధించలేదని, ఎందుకంటే అప్పటికే తాము విడిపోయామని ఈషా తెలిపింది.


ఇవీ చదవండి:

రిషభ్ పంత్ సెంచరీ చేస్తే అదే జరుగుతుందా.. టీమిండియా ఓటమికి అతడే కారణమా..


బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..

శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఓటమి ఎలాంటిదంటే..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 08:07 PM