Rishabh Pant: రిషభ్ పంత్ సెంచరీ చేస్తే అదే జరుగుతుందా.. టీమిండియా ఓటమికి అతడే కారణమా..
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:07 PM
ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గెలిచే స్థితి నుంచి కనీసం డ్రా కూడా చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఐదు సెంచరీలు నమోదైనా బౌలింగ్ వైఫల్యంతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకుంది (Ind vs Eng). గెలిచే స్థితి నుంచి కనీసం డ్రా కూడా చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఐదు సెంచరీలు నమోదైనా బౌలింగ్ వైఫల్యంతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ సెంచరీలు టీమిండియాకు శాపంలా మారుతున్నాయట.
ముఖ్యంగా విదేశీ వేదికల్లో పంత్ సెంచరీలు చేసిన అన్ని సార్లూ టీమిండియా గెలుపునకు దూరంగానే ఉండిపోయింది (Rishabh Pant centuries). రిషభ్ పంత్ విదేశాల్లో ఇప్పటివరకు 6 సెంచరీలు చేశాడు. ఈ సార్లు సందర్భాల్లోనూ టీమిండియా విజయం నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది. పంత్ తొలిసారిగా 2018లో ఇంగ్లండ్‌లో సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది.
ఆ తర్వాత 2019లో ఆస్ట్రేలియాలో అజేయంగా 159 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ డ్రా అయింది. ఇక, 2022లో దక్షిణాఫ్రికాలో అజేయంగా 100 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ ఓటమే ఎదురైంది. ఇక, 2022లో మరోసారి పంత్ ఇంగ్లండ్‌లో 146 పరుగులు చేశాడు. టీమిండియా ఆ మ్యాచ్ లో ఓడిపోయింది.
తాజాగా లీడ్స్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 134, 118 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలవలేకపోయింది. దీంతో విదేశీ వేదికల్లో పంత్ సెంచరీలు చేస్తే టీమిండియా గెలవదని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల్లో పంత్ పోరాటం మాత్రం అద్వితీయం. ఇతర బ్యాటర్లు విఫలం కావడం లేదా బౌలింగ్ ప్రదర్శన బాగోలేకపోవడం వల్ల మ్యాచ్‌లు టీమిండియాకు దూరమయ్యాయి.
ఇవీ చదవండి:
బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..
శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఓటమి ఎలాంటిదంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి