IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:39 PM
మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ-20లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ-20 (IND vs AUS T20 Series)లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి భారత్ టాప్ ఆర్డర్‌ను వరుసగా పెవిలియన్ పంపాడు.
అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం..
మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(68) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఓ పక్క వరుసగా వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురి కాకుండా షాట్లు ఆడుతూనే వచ్చాడు. టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిన సమయంలో నంబర్ 7లో వచ్చిన హర్షిత్ రాణా(35) పర్వాలేదనిపించాడు. వీరి భాగస్వామ్యంతోనే టీమిండియా ఓ మోస్తరు స్కోరైనా చేయగలిగింది. శుభ్‌మన్ గిల్(5), సంజూ శాంసన్(2), సూర్యకుమార్ యాదవ్(1), తిలక్ వర్మ(0), అక్షర్ పటేల్(7) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, బ్రేట్‌లెట్, నాథన్ ఎల్లిస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్ ఒక వికెట్ తీశాడు.
అలవోక విజయం..
టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అలవోకగా ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(46), ట్రావిస్ హెడ్(28), ఇంగ్లిస్(20) రాణించారు. దీంతో 13.2 ఓవర్లలోనే 126 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఆసీస్ ఛేదించి విజయం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్
Alyssa Healy: ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: ఎలీసా హీలీ