Share News

BCCI: అభిషేక్ నాయర్.. టీ దిలీప్‌లకు ఊహించని షాక్..

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:07 PM

BCCI Shock: అభిషేక్ నాయర్, టీ దిలీప్‌లకు ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ) ఊహించని షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. వీరిద్దర్నీ పదువులనుంచి తొలగించాలని నిర్ణయించింది.

BCCI: అభిషేక్ నాయర్.. టీ దిలీప్‌లకు ఊహించని షాక్..
BCCI Shock

ఇండియా క్రికెట్ టీం కోచ్‌లు అభిషేక్ నాయర్, టీ దిలీప్‌లకు ఊహించని షాక్ తగిలింది. ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల స్థానం నుంచి అభిషేక్, దిలీప్‌లను తొలగించబోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా సరిగా ఆడలేకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాలోపై 1-3 తేడాతో ఇండియా ఓడిపోయింది. బీసీసీఐ ఈ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించింది. బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లైన నాయర్, దిలీప్‌లను ఇందుకు బాధ్యులుగా తేల్చినట్లు సమాచారం.


ఇంగ్లాండ్ టూర్ నేపథ్యంలో వీరిద్దర్నీ వారి పదువులనుంచి తొలగించాలని నిర్ణయించింది. వీరితో పాటు స్ట్రెంథ్, కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌ని కూడా బీసీసీఐ బయటకు పంపించనుంది. గౌతమ్ గంభీర్ ఇండియా టీంకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియా టీమ్ కోచింగ్ స్టాఫ్‌ మారారు. అభిషేక్ నాయర్, రియాన్ టెన్ డౌషెట్, మోర్నే మోర్కెల్‌లను గౌతమ్ గంభీర్ తనతో పాటు కోచ్ టీమ్‌లోకి తీసుకువచ్చారు. వీరిలో అభిషేక్ నాయర్‌కు బీసీసీఐ ఉద్వాసన పలికింది.


ఈ నేపథ్యంలోనే రియాన్ టెన్ డౌషెట్‌ ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సౌత్ ఆఫ్రికా ట్రైనర్ ఆండ్రియన్ టీ రౌక్స్.. స్ట్రెంథ్, కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆడ్రియన్ టీ రౌక్స్.. పంజాబ్ కింగ్స్‌తో కలిసి పని చేస్తున్నారు. ఇక, ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా ఇంగ్లాండ్ టూర్ కోసం సిద్ధం కానుంది. ఆ వెంటనే ఆగస్టులో బంగ్లాదేశ్‌తో సిక్స్ వైట్ బాల్ మ్యాచెస్ ఆడనుంది.


ఇవి కూడా చదవండి

మనిషి కాదు మృగం.. 11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..

ఆ ఒక్క విటమిన్ లోపం.. మీ వైవాహిక జీవితం నాశనం.. చేస్తుంది..

Updated Date - Apr 17 , 2025 | 12:30 PM