Amit Mishra Denies Marriage: పెళ్లి కాని మిశ్రా భార్యను వేధించాడట
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:20 AM
పెళ్లి కాకపోయినా భార్య వేధించాడంటూ అమిత్ మిశ్రాపై వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించాడు. తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ అమిత్ మిశ్రా (42)కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. మిశ్రాకు వివాహం కాకపోయినా.. కట్నం కోసం భార్యను వేధించాడంటూ అతడిపై కేసు నమోదైందనే వార్త నెట్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వార్తలను మిశ్రా ఖండించాడు. రూ. కోటి పరిహారం కోరుతూ అమిత్‌పై భార్య కేసు వేసిందని, పెళ్లి సమయంలో కట్నం కింద రూ. 10 లక్షల నగదు, కారు డిమాండ్ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొందట. ఇది పూర్తిగా తప్పుడు వార్త అని మిశ్రా చెప్పాడు. అసలు తనకు పెళ్లి కాలేదన్న విషయం అందరికీ తెలుసన్నాడు. తనకు సంబంధంలేని కథనాలకు తన ఫొటోను వాడితే చట్టపరంగా చర్యలు తీసుకొంటానని హెచ్చరించాడు.