Share News

World Swimming Championship: చైనా చిన్నది..పతకం పట్టేసింది

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:47 AM

చైనాకు చెందిన 12 ఏళ్ల యు జిడి.. ప్రపంచ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం అందుకుంది.

World Swimming Championship: చైనా చిన్నది..పతకం పట్టేసింది

ప్రపంచ స్విమ్మింగ్‌ రిలేలో జిడికి కాంస్యం

సింగపూర్‌: చైనాకు చెందిన 12 ఏళ్ల యు జిడి.. ప్రపంచ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం అందుకుంది. 4్ఠ200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ టీమ్‌ రిలే ఈవెంట్‌ ఫైనల్లో జిడి లేకుండానే చైనా జట్టు బరిలోకి దిగింది. అయితే ప్రిలిమ్స్‌లో పాల్గొన్నందున జట్టు సభ్యురాలిగా జిడి కూడా పతకం అందుకుంది. ఇక ఫైనల్లో ఆస్ట్రేలియాకు స్వర్ణం, అమెరికాకు రజతం లభించాయి. ఇప్పటికే 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌, మెడ్లే వ్యక్తిగత విభాగాల్లోనూ పోటీపడ్డ జిడి.. ఆ రెండు ఈవెంట్లలోనూ నాలుగో స్థానంలో నిలిచింది. జిడి... ఇంకా 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే ఈవెంట్‌లో పోటీపడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 03:47 AM