Youtuber Kanika Devrani: రైలులో మత్తు మందు చల్లి దోచేశారు.. యూట్యూబర్ ఆవేదన
ABN , Publish Date - Jun 28 , 2025 | 06:16 PM
Youtuber Kanika Devrani: యూట్యూబర్ కనికా దేవ్‌రాణి బ్రహ్మపుత్రా రైలులో ప్రయాణిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయ్‌గురి జంక్షన్‌లో రైలు ఆగింది. ఓ వ్యక్తి కనికా ఉన్న కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు.

ఓ లేడీ యూట్యూబర్‌కు రైలులో దారుణమైన అనుభవం ఎదురైంది. ఓ దొంగ ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని ఆమెతో పాటు తోటి ప్రయాణికుల ఫోన్లను దొంగిలించాడు. మత్తు మందు చల్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. యూట్యూబర్ కనికా దేవ్‌రాణి బ్రహ్మపుత్రా రైలులో ప్రయాణిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయ్‌గురి జంక్షన్‌లో రైలు ఆగింది. ఓ వ్యక్తి కనికా ఉన్న కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు. మత్తు మందు స్ప్రే చేసి అందరి ఫోన్లు దొంగిలించాడు. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాలపై కనికా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియో విడుదల చేసింది. రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో న్యూ జల్పాయ్‌గురి జంక్షన్ దగ్గర ఓ వ్యక్తి 2 ఏసీ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు. ఆ వ్యక్తి నాతో పాటు మిగిలిన ప్రయాణికులపై మత్తు మందు స్ప్రే చేశాడు. దీంతో మేమంతా కొద్దిసేపు స్ప్రహ తప్పి పడిపోయాం. నేను తేరుకునే సమయానికి నా ఐఫోన్ పోయింది. నేను దాన్ని నా దిండుకింద ఉంచాను. దాన్ని దొంగిలించాడు. నాతో పాటు మిగిలిన వాళ్ల ఫోన్లు కూడా పోయాయి. రైల్వే పోలీస్‌లు మాకు సాయం చేయలేదు.
ఐఫోన్ లైవ్ లొకేషన్ తెలుస్తున్నా వారు పట్టించుకోలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు స్పందించారు. నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వేకు చెందిన చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి కపింజల్ కిషోర్ శర్మ మాట్లాడుతూ.. ‘ఆ యువతి ప్రస్తుతం గువహటిలో ఉంది. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆమె ఇచ్చిన ఫిర్యాదును తీసుకుంది. టెన్నాలజీని ఉపయోగించి పోయిన ఆమె ఫోన్‌ను.. దొంగలను పట్టుకున్నాము. ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతుంది. దోషులకు కఠిన శిక్షలు పడతాయి. ఇలాంటి మళ్లీ జరగకుండా చూసుకుంటాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? కోక్‌తో చెక్ పెట్టండి..
పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి బంగారం ఎలా తీస్తారంటే..