స్కూలు బాలికలతో తప్పుడు ప్రవర్తన.. చావగొట్టిన జనం..
ABN , Publish Date - Apr 27 , 2025 | 09:10 PM
Youth Beaten By People: అయితే, ఓ యువకుడితో మాత్రం అత్యంత దారుణంగా వ్యవహరించారు. అతడి బట్టలు చింపేశారు. కర్రలు, రాడ్లతో అతడిపై దాడి చేశారు. అతడ్ని నగ్నంగా రోడ్డుపై ఊరేగిస్తూ కొట్టారు. ఈ దారుణంపై పోలీసులకు సమాచారం వెళ్లింది.

ఈ మధ్య కాలంలో ఆడవారిపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొందరు మృగాళ్లు వావి వరసలు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. తాజాగా, ఓ యువకుడు, అతడి స్నేహితులు స్కూలు బాలికలతో తప్పుగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న జనం వారిపై రెచ్చిపోయారు. దారుణంగా చితక్కొట్టారు. ఆ యువకుడ్ని మాత్రం నడిరోడ్డులో నడిపిస్తూ దారుణంగా కొట్టారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన ఓ ముగ్గురు యువకులు రోడ్డుపై వెళుతున్న స్కూలు బాలికలతో తప్పుగా ప్రవర్తించారు. బాలికలతో అసభ్యంగా మాట్లాడారు. దీంతో బాలికలు ఈ విషయాన్ని పక్కనే ఉన్న జనానికి చెప్పారు. ఆ జనం రంగంలోకి దిగారు. ఆ ముగ్గుర్ని చుట్టు ముట్టారు. వారందరినీ కొట్టడం మొదలెట్టారు. అయితే, ఓ యువకుడితో మాత్రం అత్యంత దారుణంగా వ్యవహరించారు. అతడి బట్టలు చింపేశారు. కర్రలు, రాడ్లతో అతడిపై దాడి చేశారు. అతడ్ని నగ్నంగా రోడ్డుపై ఊరేగిస్తూ కొట్టారు. ఈ దారుణంపై పోలీసులకు సమాచారం వెళ్లింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకులపై దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే కులానికి సంబంధించిన చర్చ మొదలైంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఓ కులానికి చెందిన వారు కావటంతోటే వారిపై అగ్ర కులానికి చెందిన వారు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దీంతో పోలీసులు ఘటనపై క్లారిటీ ఇచ్చారు. గొడవకు కులంతో ఎటువంటి సంబంధం లేదన్నారు.
ఇవి కూడా చదవండి
Nani: బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేసిన హీరో నాని
K Ramakrishna Rao IAS: బ్రేకింగ్ .. తెలంగాణ కొత్త సీఎస్‌గా కే రామకృష్ణారావు