Share News

Viral Video: అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:07 PM

Viral Video: కరెంట్ స్తంభం కూలి ఓ మహిళ స్కూటీపై పడింది. స్థానికులు ఈ సంఘటనపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వారికి ఫోన్ చేసి చెప్పారు. వారు వెంటనే ఆ ప్రాంతానికి కరెంట్ సప్లై నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని వైర్లను కట్ చేసి స్కూటీని బయటకు తీశారు.

Viral Video: అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
Viral Video

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అది నిజమే అనిపిస్తుంది. రోడ్డు మీద స్కూటీపై వెళుతున్న ఓ మహిళపై కరెంట్ స్తంభం కూలి పడింది. అదృష్టం బాగుండి ఆ మహిళ ప్రాణాలతో బతికి బయటపడింది. ఈ సంఘటన ఢిల్లీలో సోమవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రోడ్డుపై వెళుతూ ఉంది. ఠాగూర్ గార్డెన్స్ ఏడీ బ్లాక్‌లోని రోడ్డులోకి వచ్చింది.


అయితే, ఉన్నట్టుండి ఓ కరెంట్ స్తంభం ఆమె స్కూటీపై పడింది. స్తంభం మీద పడుతున్న సమయంలో ఆమె ముందుకు జరిగి తప్పించుకుంది. అయితే, స్కూటీ మీద పడ్డ సమయంలో స్తంభంకు ఉన్న తీగల్లో కరెంట్ పాస్ అవుతూ ఉంది. స్కూటీ మీద పడ్డ వెంటనే కరెంట్ సప్లై ఆగిపోయింది. లేదంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయేది. ఇక, ఆ మహిళ కరెంట్ వైర్ల మధ్యలో చిక్కుకుపోయింది. అక్కడి జనం పెద్ద ఎత్తున ఆమెకు సాయం చేయడానికి వచ్చారు. ఎంతో కష్టం మీద ఆమెను అక్కడినుంచి బయటకు లాగారు.


స్థానికులు ఈ సంఘటనపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వారికి ఫోన్ చేసి చెప్పారు. వారు వెంటనే ఆ ప్రాంతానికి కరెంట్ సప్లై నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని వైర్లను కట్ చేసి స్కూటీని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రిషబ్ త్యాగి అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘ఆ దేవుడే ఆమెను కాపాడాడు’ అని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన ఎద్దు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని..

షాకింగ్ సీన్.. ప్రొడ్యూసర్‌ను చెప్పుతో కొట్టిన నటి

Updated Date - Jul 30 , 2025 | 04:31 PM