ChatGPT Claims: చాట్ జీపీటీ చెప్పిందని భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ
ABN , Publish Date - May 11 , 2025 | 11:54 AM
ChatGPT Claims: మనుషుల బుద్ధి నశిస్తోందనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. చాట్ జీపీటీ చెప్పిందని ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చింది. భార్య చేసిన పనికి ఆ భర్త షాక్‌తో పాటు షేక్ కూడా అయ్యాడు. న్యాయపోరాటం చేస్తున్నాడు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రతీ రంగంలో ఏఐ వాడకం సర్వసాధారణంగా మారిపోయింది. అంతేకాదు.. మనుషులు కూడా ఏఐతో స్నేహం చేస్తున్నారు. తమ కష్టనష్టాలను ఏఐకి చెప్పుకుని సలహాలు అడుగుతున్నారు. కొన్ని విషయాల్లో ఏఐ మంచి సలహాలే ఇస్తోంది. కానీ, కొన్ని సార్లు ఏఐ కారణంగా బంధాలు నాశనం అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళ చాట్ జీపీటీ చెప్పిందని భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె భర్తకు వేరే మహిళతో సంబంధ ఉందని చాట్ జీపీటీ చెప్పటంతో ఈ దారుణం జరిగింది.
గ్రీస్‌కు చెందిన బాధిత భర్త గ్రీకు మార్నింగ్ టీవీ షోలో పాల్గొన్నాడు. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ భర్త చెబుతున్న దాని ప్రకారం.. ఓ రోజు అతడి భార్య ఇద్దరికీ కాఫీ తయారు చేసింది. వాటిని కప్పుల్లో నింపుకెళ్లి ఓ కప్పు భర్తకు ఇచ్చింది. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. టీ తాగటం అయిపోయిన తర్వాత ఖాళీ కప్పులు మిగిలాయి. రెండింటి అడుగునా కొంచెం కాఫీ మిగిలి ఉంది. భార్య రెండు కప్పుల్ని ఫొటో తీసింది. వాటిని చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేసింది. వాటిని చూసి జోష్యం చెప్పమని అడిగింది.
‘ నీ భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె పేరు Eతో మొదలవుతుంది. ఇప్పుడు ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. ఆమె వల్ల మీ కుటుంబం నాశనం అవుతుంది ’ అని చెప్పింది. దీంతో ఆ మహిళ ఆగ్రహానికి గురైంది. భర్తతో గొడవ పడకుండా.. అక్రమ సంబంధం గురించి ఏ మాత్రం అడగకుండానే విడాకులకు ఫైల్ చేసింది. దీంతో భర్త షాక్ అయ్యాడు. ‘ ఆ చెత్త విషయం గురించి తెలిసి నాకు మొదట నవ్వువచ్చింది.
అయితే, నా భార్య విడాకుల విషయంలో సీరియస్‌గా ఉంది. నన్ను దూరంగా వెళ్లిపొమ్మంది. మా పిల్లలకు కూడా మేము విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పేసింది. కొన్ని రోజుల తర్వాత ఆమె లాయర్ దగ్గరినుంచి నాకు ఫోన్ వచ్చింది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఏఐ చెప్పిన దానికి లీగల్ వాలిడిటీ లేదని మా లాయర్ వాదిస్తున్నాడు’ అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: దీపావళి రాకెట్ కాదురా బాబు.. అది మిస్సైల్..
Operation Sindoor: సైనికులను నమ్మాలి, వెంటనిలబడాలి.. శ్రీ శ్రీ అభినవ శంకర భారతి