Share News

Snack Dispute: భార్య దారుణం.. తినడానికి స్నాక్స్ తేలేదని భర్తను..

ABN , Publish Date - Jul 25 , 2025 | 06:36 PM

Snack Dispute: భార్య కోపంతో ఊగిపోయింది. భర్తపై కత్తితో దాడికి దిగింది. ఈ నేపథ్యంలోనే అతడి చెయ్యికి గాయం అయింది. అతడు బతుకు జీవుడా అని భార్య మరో సారి దాడి చేయకుండా కత్తి ఉన్న ఆమె చేతిని పట్టుకున్నాడు.

Snack Dispute: భార్య దారుణం.. తినడానికి స్నాక్స్ తేలేదని భర్తను..
Snack Dispute

తినడానికి స్నాక్స్ తేలేదన్న కోపంతో భర్తపై దారుణానికి ఒడిగట్టింది ఓ భార్య. అతడిపై కత్తితో దాడి చేసింది. అదృష్టం బాగుండి చేతికి చిన్న గాయంతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర భారత దేశంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తినడానికి స్నాక్స్ తెమ్మని భర్తను అడిగింది. బయటకు వెళ్లి వచ్చిన అతడు స్నాక్స్ తేవటం మర్చిపోయాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా కొద్దిసేపటికే చినికి చినికి గాలి వానలా మారింది.


భార్య కోపంతో ఊగిపోయింది. భర్తపై కత్తితో దాడికి దిగింది. ఈ నేపథ్యంలోనే అతడి చెయ్యికి గాయం అయింది. అతడు బతుకు జీవుడా అని భార్య మరో సారి దాడి చేయకుండా కత్తి ఉన్న ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ రెచ్చిపోయింది. అక్కడే ఉన్న కూతురు రంగంలోకి దిగింది. తల్లిని వెనక్కు పట్టిలాగే ప్రయత్నం చేసింది. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు. ఈ సంఘటనకు సంబంధించిన 26 సెకన్ల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


తర్వాత ఏం జరిగిందో ఆ వీడియోలో లేదు. అసలు ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్న సరైన వివరాలు కూడా లేవు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆడవాళ్లు మరీ ఇంత దారుణంగా తయారు ఏంట్రా.. భర్త అంటే శత్రువుగా మారిపోయాడు’..‘అమ్మ బాబోయ్.. వాళ్లిద్దరూ భార్యాభర్తలా లేక శత్రువులా.. అలా కొట్టుకుంటున్నారేంటి’..‘ఆ మహిళను ఊరికే వదిలేయకూడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

డ్రైవర్ కొంపముంచిన పనస పండు.. తప్పు చేయకున్నా..

జైలు నుంచి పారిపోయిన సౌమ్య మర్డర్ కేసు దోషి

Updated Date - Jul 25 , 2025 | 09:36 PM