Share News

Egypt: తిమింగలాలు ఒకప్పుడు భూమిపై నడిచేవా? బయటపడిన భారీ అస్థిపంజరం..

ABN , Publish Date - Jul 10 , 2025 | 08:15 AM

ఈజిప్టును పిరమిడ్ల దేశం అని కూడా పిలుస్తారు. ఈ దేశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర, పురాతన విషయాలను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటారు. ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశంలో ఒకవైపు నైలు నది, మరోవైపు సహారా ఎడారి ఎన్నో విశేషాలకు నెలవుగా మారాయి.

Egypt: తిమింగలాలు ఒకప్పుడు భూమిపై నడిచేవా? బయటపడిన భారీ అస్థిపంజరం..
huge skeleton of fish

ఇంటర్నెట్ డెస్క్: ఈజిప్ట్‌ (Egypt)ను ప్రాచీన నాగరికతకు చిహ్నంగా భావిస్తుంటారు. ఈజిప్టును పిరమిడ్ల దేశం అని కూడా పిలుస్తారు. ఈ దేశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర, పురాతన విషయాలను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటారు. ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశంలో ఒకవైపు నైలు నది, మరోవైపు సహారా ఎడారి (Sahara Desert) ఎన్నో విశేషాలకు నెలవుగా మారాయి. తాజాగా సహారా ఎడారికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు (Whale Valley in Egypt).


ప్రస్తుతం సహారా ఎడారి ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు సముద్ర జీవులు నివసించిన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ప్రస్తుతం నేడు అక్కడ ఇసుక మాత్రమే ఉంది. వేల సంవత్సరాల క్రితం అక్కడ సముద్రం ఉండేదని, తిమింగలాలు వంటి పెద్ద సముద్ర జీవులు అక్కడ ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహారా ఎడారిలోని 'వాడి అల్-హితాన్' అనే ప్రాంతంలో పురాతన తిమింగలాల అస్థిపంజరాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 'వాడి అల్-హితాన్' అంటే తిమింగలాల లోయ అని అర్థం. ఈ అస్థి పంజరాలు దాదాపు 40 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి కావచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.

egypt2.jpg


ఈ ప్రాంతంలో దాదాపు 400 వరకు తిమింగలాల అస్థిపంజరాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ శిలాజాలు ఈయోసిన్ యుగానికి చెందినవై ఉంటాయని, ఈ ప్రాంతం ఒకప్పుడు పురాతన టెథిస్ మహా సముద్రం కింద ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణలను యునెస్కో పరిణామ క్రమానికి సంబంధించిన అతిపెద్ద సాక్ష్యాలలో ఒకటిగా భావిస్తోంది. ఈ తిమింగలాల అస్థిపంజరాలకు కాళ్లు, వేళ్లు కూడా ఉన్నాయి. అంటే వేల సంవత్సరాల క్రితం తిమింగలాలు భూమిపై నడిచేవని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇదేం ఆత్రం బాబాయ్.. మద్యం షాప్‌నకు వెళ్లి అతడు చేసిన పని చూస్తే నవ్వకుండా ఉండలేరు..


ఈ ఫొటోలో పక్షిని కనిపెట్టగలిగితే.. మీ కళ్ల గురించి ఆలోచించనక్కర్లేదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2025 | 12:48 PM