Crocodile Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిరుత ముందు మొసలి బలం ఏమైందో చూడండి..
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:35 PM
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలి నోటికి చిక్కితే అత్యంత బలమైన ఏనుగు కూడా ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఒడ్డు మీదకు వస్తే మాత్రం మొసలి బలహీనంగా మారిపోతుంది.

ఇంటర్నెట్ డెస్క్: నీటిలోని మొసలి (Crocodile) అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలి నోటికి చిక్కితే అత్యంత బలమైన ఏనుగు కూడా ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఒడ్డు మీదకు వస్తే మాత్రం మొసలి బలహీనంగా మారిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో మొసలి తనను పట్టుకున్న చిరుత (Jaguar) నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేసింది. అయితే అంత బలమైన మొసలి కూడా చిరుత పట్టు నుంచి తప్పించుకోలేకపోయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
salveopantanal అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ నది ఒడ్డున సేద తీరుతున్న ఓ మొసలిని చిరుత పట్టుకుంది. మొసలి దవడ కొరుకుతూ చంపడానికి ప్రయత్నించింది. అయితే ఆ చిరుత నోటి నుంచి తప్పించుకునేందుకు మొసలి తన బలాన్ని అంతా ఉపయోగించింది. చాలా సేపు చిరుతతో పోరాడింది. అయితే చిరుత బలం ముందు మొసలి బలం సరిపోలేదు. చివరకు మొసలిని చిరుత లాక్కెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది.
చిరుత వేటకు సంబంధించిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ 55 లక్షల మందికి పైగా వీక్షించారు. 54 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శక్తి ఉన్న వాడే నిజమైన రాజు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది జాగ్వార్ శక్తి అంటూ మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో 995ల మధ్యనున్న 999ను 9 సెకెన్లలో కనిపెట్టండి..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..