Food in Train: ఛీ..ఛీ.. రైలులో తినే ఫుడ్ ఇంత ప్రమాదకరమా? పట్టాల పక్కన ఇతడేం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:17 PM
రైళ్లలో అమ్మే అహారంపై ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి. శుచి, శుభ్రత పాటించరని చాలా మంది చెబుతుంటారు. డబ్బుల సంపాదనే ధ్యేయంగా ప్రయాణికుల ఆరోగ్యాలతు ఆడుకుంటారని అందరూ అంటుంటారు. దీనిని రుజువు చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మన దేశంలో అతి ఎక్కువ మంది రైలు ప్రయాణమే (Train Journey) చేస్తుంటారు. దేశవ్యాప్తంగా రోజుకు కొన్ని లక్షల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తుంటారు. రైలు ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంటుంది. అయితే రైళ్లలో అమ్మే అహారంపై మాత్రం ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి (Food in train). శుచి, శుభ్రత పాటించరని చాలా మంది చెబుతుంటారు. డబ్బుల సంపాదనే ధ్యేయంగా ప్రయాణికుల ఆరోగ్యంతో ఆడుకుంటారని అందరూ అంటుంటారు. దీనిని రుజువు చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
india.360_degrees అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి రైలు పట్టాల పక్కన కూర్చుని నీటితో అల్యూమినియం డిస్పోజబుల్ బాక్స్‌లను (Aluminum food boxes) కడుగుతున్నాడు. ఆ అల్యూమినియం బాక్స్‌లలోనే ఆహారాన్ని ప్యాక్ చేసి రైలు అమ్ముతుంటారు. ప్రయాణికులు తినేసిన తర్వాత పారేసే ఆ డిస్పోజబుల్ బాక్స్‌లను సేకరించి వాటిని కడిగి మళ్లీ ఉపయోగిస్తున్నట్టు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఓ ప్రయాణికుడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను ఎక్కడ, ఎప్పుడు తీశాడనే విషయంలో క్లారిటీ లేదు.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.5 కోట్ల మందికి పైగా వీక్షించారు. 1.3 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. వామ్మో.. రైళ్లలో అమ్మేది ఏదీ తినకూడదని అర్థమవుతోందని ఒకరు కామెంట్ చేశారు. ఆ బాక్స్‌లలో తిరిగి ఫుడ్ ప్యాక్ చేస్తారా అని ఒకరు ప్రశ్నించారు. అతడు అల్యూమినియం సేకరిస్తున్నాడేమో అని ఇంకొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తాగేసి పడిపోయిన యజమాని.. ఎద్దు అతడిని ఇంటికి ఎలా తీసుకెళ్తోందో చూడండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో 99ల మధ్యనున్న 96ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..