Share News

Viral Video On Tea: నీకేం పోయేకాలం తల్లీ.. టెంకాయ నీటిని ఇలా కూడా వాడుతారా..

ABN , Publish Date - Apr 26 , 2025 | 02:20 PM

సాధారణంగా టీల్లో చాలా రకాలు ఉన్న సంగతి తెలిసిందే. టీ, అల్లం టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లూ టీ అంటూ ఇలా పలు రకాలు ఉన్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో టీకి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ యువతి ఏం చేసిందో తెలిస్తే మీ రియాక్షన్ మాములుగా ఉండదు.

Viral Video On Tea: నీకేం పోయేకాలం తల్లీ.. టెంకాయ నీటిని ఇలా కూడా వాడుతారా..
Cocunut Water Tea

Cocunut Water Tea Video Viral: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని కొంతమంది యూజర్లు వింత వింత వీడియోలు చేస్తుంటారు. అందులో కొన్ని వీడియోలు నవ్వించే విధంగా ఉంటే, మరి కొన్ని కోపం తెచ్చే విధంగా కూడా ఉంటాయి.అయితే, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన కొందరు టీ ప్రియులు మాత్రం వీడియో చేసిన వారిని మాములుగా తిట్టడం లేదు. ఇంతకు ఏముంది ఆ వీడియోలో ? ఎందుకు వీడియో చేసిన వారిపై కోపం పడుతున్నారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


మనలో చాలా మందికి టీ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఉదయం లేచిందే మొదలు డేని టీతో స్టార్ట్ చేయాల్సిందే. టీ ప్రియులు రోజుకు కనీసం మూడు లేదా నాలుగు సార్లు అయినా టీ తాగుతారు. ఎందుకంటే టీ తాగడం వల్ల శరీరం వెంటనే యాక్టివ్‌గా అనిపిస్తుంది. దీనితో పాటు అలసటను కూడా తగ్గిస్తుంది. అలాంటి టీని ఓ యువతి డిఫరెంట్‌గా ట్రై చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కొబ్బరి నీటితో టీ

కొబ్బరి నీటితో టీ తాయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇంకెముందు, ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. సమ్మర్‌లో అందరూ చల్లగా ఉండటానికి కొబ్బరి నీళ్లను తాగుతుంటే, దానిని కూడా టీ చేసి అమ్మడం ఎంత వరకు కరెక్ట్ అని మండిపడుతున్నారు. వీడియోలో ఆమె టీని ఎలా తయారు చేసిందంటే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కట్ చేసిన కొబ్బరి బొండంను దానిపై ఉంచింది. కొబ్బరి నీటిని వేడి చేసి అందులో కొంచెం చెక్కర, అల్లంను వేసి మరిగించింది,. తర్వాత పాలను అందులో కలిపి టీ తయారు చేసింది.

ఆ వీడియోను చూసిన ఓ టీ ప్రియుడు "నీకేం పోయేకాలం తల్లీ.. టెంకాయ నీటిని ఇలా కూడా వాడుతారా.."అని కామెంట్స్ చేయగా, మరొకరు... టీ టేస్ట్‌ను ఎందుకు చెడగొడుతున్నారు? టీపై ఇలాంటి ప్రయోగాలు చేయకండి అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా ఆ వీడియోపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Also Read:

Pak Official Throat Slit Gesture: గొంతు కోస్తా.. నిరసనకారులపై పాక్ హైకమిషన్ అధికారి నీచ సంకేతాలు

Pahalgam Attack-Sourav Ganguly: పాక్‌తో క్రికెట్ రిలేషన్స్.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు

ahalgam Terror Attack: చెలరేగిపోయిన ఉగ్రవాదులు.. వెలుగులోకి మరో వీడియో..

Updated Date - Apr 26 , 2025 | 02:26 PM