Woman Caught Stealing: నిజంగా ఇది ఊహించని ట్విస్ట్.. ఆ మహిళ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:05 PM
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆడవేషంలో దొంగతనానికి పాల్పడ్డాడు. పొరిగింటి బయట ఉండే కొరియర్ పార్సిల్స్‌ను ఎత్తుకెళ్లిపోయాడు. సీసీటీవీ కెమెరాల కారణంగా అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
దొంగలు మరీ తెలివి మీరి పోయారు. దొంగతనాలు చేయడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి ఏకంగా ఆడవేషం వేసుకున్నాడు. పొరిగింటి దగ్గర దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే, అనుకోని విధంగా అతడు అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అలబామాకు చెందిన 46 ఏళ్ల టాడ్ ఆంథోనీ బాండ్ గత కొంతకాలం నుంచి తను ఉండే ఏరియాలో తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
పక్కింట్లో ఉండే వారికి తరచుగా పెద్ద మొత్తంలో కొరియర్ పార్సిల్స్ రావటం అతడు చూశాడు. కొరియర్ సర్వీసు వాళ్లు ఆ పార్సిల్స్‌ను ఇంటి బయట ఉంచి వెళుతుండటంతో వాటిపై ఆంథోనీ కన్నుపడింది. ఎలాగైనా వాటిని దొంగిలించాలని భావించాడు. రెండు రోజుల క్రితం ఆడ వేషంలో కారులో పొరిగింటి దగ్గరకు వెళ్లాడు. ఇంటి ముందు కారు ఆపి నేరుగా పార్సిల్స్ ఉన్న చోటుకు వెళ్లాడు. పార్సిల్స్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ దొంగతనాలపై పొరిగింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆంథోనీని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం దొంగతనానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆంథోనీ తెలివి చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి
‘మైక్రో మెడిటేషన్’ వచ్చేసిందోచ్...
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్ అరెస్ట్.. త్వరలో విదేశాల నుంచి ఇండియాకు..