UPSC Aspirant: ఐఏఎస్ ఆఫీసర్ పాడుబుద్ధి బయట పెట్టిన యువతి
ABN , Publish Date - Apr 27 , 2025 | 06:31 PM
UPSC Aspirant: తాజాగా, ఓ యువతి తన జీవితంలో చోటుచేసుకున్న ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ‘ ఎగ్జామ్ వ్యక్తిని మార్చలేదు. అందరూ ఒకే జాతికి చెందిన వారు.. అలాంటప్పుడు వేరుగా ఎలా ఉంటారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఒకప్పుడు ఏదైనా సమస్య ఎదురైనపుడు తెలిసిన వాళ్లతో పంచుకుని బాధపడేవాళ్లు. తమకు ఇబ్బంది కలిగించిన విషయాలను కూడా ఆ తెలిసిన వాళ్లతోనే పంచుకునే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా కారణంగా మన జీవితంలో జరిగే విషయాలను నలుగురితో కాదు.. 4 కోట్ల మందితో పంచుకునే అవకాశం ఉంటోంది. చాలా మంది తమ జీవితాలను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తమకు ఎదురైన అనుభవాలను అందరితో పంచుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి తన జీవితంలో చోటుచేసుకున్న ఓ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
కొన్నేళ్ళ క్రితం ఓ ఐఏఎస్ అధికారి తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆ యువతి అంది. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘ ఓ ఐఏఎస్ అధికారి ఉండేవాడు. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నపుడు .. అతడు ఎగ్జామ్ క్లియర్ చేశాడు. నేను అతడ్ని గైడెన్స్ ఇవ్వమని అడిగాను. ‘ నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు. నిన్ను గైడ్ చేస్తే.. రిటర్న్ గిఫ్ట్‌గా నాకేమిస్తావు ’అని అడిగాడు. ఇప్పుడతడికి భార్య, ఓ బిడ్డ ఉన్నారు. ఇప్పటికీ అతడి బుద్ధి అలాగే ఉందా? లేక మారిందా? అని ఆలోచిస్తూ ఉన్నాను’అని రాసుకొచ్చింది. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ‘ ఎగ్జామ్ వ్యక్తిని మార్చలేదు. అందరూ ఒకే జాతికి చెందిన వారు.. అలాంటప్పుడు వేరుగా ఎలా ఉంటారు. దాంతో విద్యకు సంబంధం లేదు. మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఓ ఎగ్జామ్ వల్ల వందల ఏళ్లుగా ఉన్న బుద్ధి మారుతుందని నువ్వు ఆశించకూడదు’..‘ మోసాలకు పాల్పడ్డ సివిల్ సర్వెంట్స్ చాలా మందే ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆడవాళ్లను మోసం చేశారు. ఇలాంటి వాళ్లతో డీల్ చేస్తున్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి’..‘ నేను ట్విటర్‌లోకి కొత్తగా వచ్చిన సమయంలో.. ఓ ఐపీఎస్ అధికారి నాతో తప్పుగా ప్రవర్తించాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఫొటో గ్రాఫర్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ
Shruti Haasan: లవ్ ఫెయిల్యూర్స్ గురించి స్పందించిన శృతి