Share News

Viral Video: స్టంట్ చేస్తుండగా ప్రమాదం.. 15 అడుగుల ఎత్తులోంచి పడ్డ యువకుడు

ABN , Publish Date - Jul 30 , 2025 | 09:57 PM

Viral Video: ఓ యువకుడు తన బైకు మీద వెల్ ఆఫ్ డెత్‌లో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బైకు మీద నుంచి పట్టు తప్పి 15 అడుగుల కిందపడిపోయాడు. అయితే, బైకు మాత్రం పడలేదు.

Viral Video: స్టంట్ చేస్తుండగా ప్రమాదం.. 15 అడుగుల ఎత్తులోంచి పడ్డ యువకుడు
Viral Video

‘వెల్ ఆఫ్ డెత్’ స్టంట్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరో కమల్ హాసన్ ఓ పెద్ద గోతిలో బైకు తిప్పుతూ ఉంటాడు. అదే వెల్ ఆఫ్ డెత్.. ఈ స్టంట్‌లో భాగంగా బైకులు, కార్లను కిందపడిపోనివ్వకుండా లోపలే ఎంతో చాకచక్యంగా తిప్పుతూ ఉంటారు. అయితే, ఈ స్టంట్ సందర్భంగా ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. పట్టు తప్పి 15 అడుగుల ఎత్తులోంచి కిందపడిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మహరాజ్‌గంజ్‌లోని పంచముఖి శివుని గుడి సమీపంలో సావన్ జాతర జరుగుతోంది. ఈ జాతరలో భాగంగా ‘వెల్ ఆఫ్ డెత్’ను కూడా ఏర్పాటు చేశారు. ఓ యువకుడు తన బైకు మీద వెల్ ఆఫ్ డెత్‌లో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బైకు మీద నుంచి పట్టు తప్పి 15 అడుగుల కిందపడిపోయాడు. అయితే, బైకు మాత్రం పడలేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ బైకు మాత్రం అలానే తిరుగుతూ ఉంది. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా గంట పాటు అలాగే తిరుగుతూ ఉండిపోయింది.


అక్కడికి వచ్చిన జనం దాన్ని చూసి షాక్ అయిపోయారు. ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఇక, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఎవ్వరూ లేకపోయినా.. బైకు మాత్రమే డెత్ ఆఫ్ వెల్‌లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన ఎద్దు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని..

షాకింగ్ సీన్.. ప్రొడ్యూసర్‌ను చెప్పుతో కొట్టిన నటి

Updated Date - Jul 30 , 2025 | 09:57 PM