Police Station Viral Video: మానవత్వం మరిచిన పోలీస్.. మరీ ఇంత దారుణమా..
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:52 PM
Police Station Viral Video: ఆ వ్యక్తి చేతులు, కాళ్లు, వీపుపై పోలీస్ బెల్టుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ వ్యక్తి దెబ్బలు తాళలేక ఏడుస్తూ కేకలు పెడుతున్నా.. వదిలేయమని ప్రాధేయపడుతున్నా కనికరించలేదు.

ఓ పోలీస్ అధికారి తాను ఓ మనిషన్న సంగతి మర్చిపోయాడు. కనీస మానవత్వం లేకుండా వ్యక్తిపై దారుణానికి ఒడిగట్టాడు. నాలుగు గోడల మధ్యలో ఆ వ్యక్తిని బెల్టుతో విచక్షణా రహితంగా చావగొట్టాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి ఆఫీస్ రూములో ఉన్నాడు. ఇంతలో ఓ పోలీస్ అక్కడికి వచ్చాడు. వచ్చీ రాగానే వెంట తెచ్చుకున్న తోలు బెల్టుతో ఆ వ్యక్తిని కొట్టడం మొదలెట్టాడు.
ఆ వ్యక్తి చేతులు, కాళ్లు, వీపుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ వ్యక్తి దెబ్బలు తాళలేక ఏడుస్తూ కేకలు పెడుతున్నా.. వదిలేయమని ప్రాధేయపడుతున్నా పోలీస్ కనికరించలేదు. ఆ వ్యక్తిని నేలపై పడేసి మరీ కొట్టాడు. 23 సెకన్ల ఆ వీడియో ఆగ్రా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ వీడియోపై అధికారులు స్పందిస్తూ.. ‘ఆ వీడియో ఉత్తర ప్రదేశ్ పోలీస్‌కు చెందింది కాదనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు బ్లాక్ బెల్ట్ ధరించరు. ఆ పోలీస్ నేమ్ ప్లేట్ మీద ఉత్తర ప్రదేశ్ పోలీస్ మోనోగ్రామ్ లేదు.
అయినా కూడా ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము. ఒక వేళ అది ఆగ్రా పోలీస్‌కు చెందింది అని తేలితే.. ఆ పోలీస్‌పై తప్పని సరిగా చర్యలు తీసుకుంటాము’ అని అన్నారు. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పోలీసులు రాక్షసుల్లా తయారు అవుతున్నారు. ఆ వ్యక్తిని అంతలా కొట్టాలా?’..‘అలా సాధారణ జనాలతో క్రూరంగా ప్రవర్తించే పోలీసులను ఊరికే వదిలిపెట్టకూడదు. జాబ్ నుంచి తీసేసి, జైల్లో పడేయాలి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
లంచ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదా.. 5 ఫాస్ట్ రెసిపీ ఐడియాస్ మీకోసమే..
ఇంట్లో ఎలుకలను చంపకుండా వదిలించుకోవడం ఎలా?