Share News

మునివేళ్లపై నడక...

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:41 PM

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ద్వీపమైన మడగాస్కర్‌లో ఉందీ భౌగోళిక వింత. లక్షల ఏళ్లుగా అక్కడి రాళ్లపై గాలి వల్ల జరిగిన కోతతో మొనలుగా ఏర్పడ్డాయి.

మునివేళ్లపై నడక...

దట్టమైన కారడవి... మధ్యలో సుందరమైన రాళ్ల అడవి. అడుగులో అడుగేస్తూ మునివేళ్లపై జాగ్రత్తగా నడవాలి. ఆ అడవి పేరు ‘త్సింగీ దె బెమారాహా’. మలగాసీ భాషలో ‘త్సింగీ’ అంటే ‘మునివేళ్లపై నడక’ అని అర్థం. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ద్వీపమైన మడగాస్కర్‌లో ఉందీ భౌగోళిక వింత. లక్షల ఏళ్లుగా అక్కడి రాళ్లపై గాలి వల్ల జరిగిన కోతతో మొనలుగా ఏర్పడ్డాయి.


book10.2.jpg

అత్యంత పదునుగా ఉండే సున్నపురాళ్లు ఇవన్నీ. సుమారు 600 చదరపు మైళ్లలో విస్తరించిన ఈ జాతీయ పార్కులో కొన్ని రాతి శిఖరాల ఎత్తు 50 మీటర్ల దాకా ఉంటుంది. 90వ దశకంలోనే ‘వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌’గా యునెస్కో గుర్తించింది. జీవ వైవిధ్యానికీ ఈ ప్రాంతం ప్రసిద్ధి. అందుకే పర్యాటకులు హైకింగ్‌, ట్రెక్కింగ్‌ కోసం రాళ్ల అడవిలోకి వెళ్లేందుకు ఉత్సాహం చూపుతారు.


book10,3.jpg

ఈ వార్తలు కూడా చదవండి

పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత

రైతులకు మహాప్రసాదం భూభారతి

చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త

వాట్ యాన్ ఐడియా సర్ జీ...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 20 , 2025 | 01:41 PM