Share News

White House Lunch: ట్రంప్ విందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆగదు..

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:45 PM

Trump Munir lunch memes: గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. మిస్సైల్స్, డ్రోన్లతో వరుసగా దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దేశానికి పూర్తి మద్దతు ఇస్తోంది.

White House Lunch: ట్రంప్ విందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆగదు..
Trump Munir lunch memes

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగడానికి తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజులనుంచి ప్రచారం చేసుకుంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా మీడియాలో, సోషల్ మీడియాలో ఆ విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. తాను చెప్పగానే యుద్ధం ఆపినందుకు పాకిస్తాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను అమెరికాకు పిలిపించుకున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్ హౌస్‌లో మునీర్‌కు విందు భోజనం పెట్టించారు. ట్రంప్ వైట్ హౌస్‌లో మునీర్‌కు ప్రైవేట్ లంచ్ ఏర్పాటు చేయటంపై సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి.


బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన మీమ్స్ టెంప్లెట్లను వాడి.. మునీర్ మీమ్స్ తయారు చేశారు. ఆ మీమ్స్ చూస్తుంటే నవ్వు ఆగటం లేదు. మీమ్స్ ఫార్మర్ అనే ఎక్స్ ఖాతాదారుడు ‘ట్రంప్, ఆసిమ్ మునీర్ లంచ్‌కు సంబంధించిన మొదటి ఫొటోలు వచ్చేశాయి’ అంటూ త్రీ ఇడియట్స్ మీమ్ పోస్టు చేశాడు. అమీర్ ఖాన్ ప్లేసులో మునీర్‌ను పెట్టాడు. బొమన్ ఇరానీ ప్లేసులో ట్రంప్‌ను పెట్టాడు. ఆ మీమ్ చాలా ఫన్నీగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ మీమ్స్ మనకు నవ్వు తెప్పించొచ్చు. కానీ, మునీర్ చూస్తే మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటాడు.


ట్రంప్ మాస్టర్ ప్లాన్..

గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. మిస్సైల్స్, డ్రోన్లతో వరుసగా దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దేశానికి పూర్తి మద్దతు ఇస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే, ఇరాన్‌కు పాకిస్తాన్ మిత్ర దేశం. ఒకానొక దశలో పాక్ .. ఇజ్రాయెల్‌పై అణు బాంబు దాడి చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. దీన్ని పాక్ ఖండించింది. పాక్, ఇరాన్ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పాక్‌ను తన వైపు తిప్పుకుని ఇరాన్‌కు మద్దతు ఇవ్వాకుండా చేస్తారని టాక్ నడుస్తోంది. అందుకే ప్రైవేట్ లంచ్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.


ఇవి కూడా చదవండి

20 నిమిషాల్లో పెళ్లి.. వరుడు చేసిన పనికి వధువు షాక్..

అతడి ఫోన్‌లో 13 వేల అసభ్య ఫొటోలు, వీడియోలు

Updated Date - Jun 19 , 2025 | 07:12 PM