Viral Video: వామ్మో.. వేడి నుంచి తప్పించుకోవడానికి ఇంత రిస్క్ అవసరమా.. ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Jun 14 , 2025 | 07:00 PM
ప్రస్తుతం మన దేశంలో వేసవి కాలం కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. ఫ్యాన్ కింద కూర్చున్నా వేడిగాలి చెమటలు పట్టిస్తోంది. ఏసీలు ఉన్న వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఈ వేడిని నివారించడానికి ప్రజలు వివిధ ఉపాయాలు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం మన దేశంలో వేసవి కాలం (Summer) కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. ఫ్యాన్ కింద కూర్చున్నా వేడిగాలి చెమటలు పట్టిస్తోంది. ఏసీలు ఉన్న వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఈ వేడిని నివారించడానికి ప్రజలు వివిధ ఉపాయాలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
humour_dukan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. లోతైన బావి (Well) లోపల ఒక మంచం తాళ్లతో వేలాడదీసి ఉంది. దానిపై ఒక వ్యక్తి హాయిగా పడుకున్నట్లు చూడవచ్చు. చల్లని బావిలో వేడి జాడ లేదు. ఎలాంటి ఖర్చూ లేకుండా చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే అతడు చల్లదనం కోసం చేస్తున్న పని మాత్రం రిస్క్ అని చెప్పక తప్పదు. ఏమాత్రం తేడా వచ్చినా అతడు కింద పడిపోవడం ఖాయం.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది నిజమైన దేశీ ఏసీ అని, విద్యుత్తు బిల్లు భయం లేదని మరొకరు కామెంట్ చేశారు. వేడిని అధిగమించాలనుకుంటే, మీరు బావిలో మంచం వేసి నిద్రపోవాలని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో 995ల మధ్యనున్న 999ను 9 సెకెన్లలో కనిపెట్టండి..
Crocodile Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిరుత ముందు మొసలి బలం ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..