Viral News: గుండెలు పిండేసే స్టోరీ.. తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో..
ABN , Publish Date - May 16 , 2025 | 12:19 PM
ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు చేస్తున్న పనికి తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ, అతను ఏ మాత్రం సీరియస్‌గా రియాక్ట్ కాకుండా తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటూ పోతున్నాడు. అసలు అతడు ఏం పని చేశాడు? సోషల్ మీడియాలో ఎందుకు వైరల్‌గా మారాడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Viral News: గుర్గావ్‌లో పంకజ్ అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే, రోజూ తనతో పాటు తన రెండేళ్ల చిన్నారిని కూడా తీసుకెళ్లేవాడు. స్విగ్గీ డెలివరీ చేయడానికి వెళ్లినప్పుడు చాలా సందర్భాల్లో అతడిని తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు. చిన్న పిల్లను ఎందుకు ఇలా తిప్పుతున్నావు? అంత కష్టంగా ఉంటే ఇంట్లోనే ఉండూ అని నానా మాటాలు కూడా అనేవారు. అయితే, వారి మాటలను విని స్మైల్ చేస్తూ సైలెంట్‌గా వెళ్లే వాడు తప్ప ఎదురు మాట్లాడే వాడు కాదు. ఇలా అతడి జీవన ప్రయాణం కొనసాగుతుండేది.
ఈ క్రమంలోనే ఓ లోకల్ కంపెనీ సీఈఓ అగర్వాల్ వద్దకు ఫుడ్ డెలివరీ చేయడానికి పంకజ్ తన రేండేళ్ల చిన్నారితో వెళ్లాడు. ఫుడ్ ఆర్డర్ వచ్చిందని సీఈఓకి ఫోన్ చేసి చెప్పగా అతడు పంకజ్‌ను సెకండ్ ఫ్లోర్‌కి రండి అని పిలిచాడు. అయితే, ఇంతలోనే పంకజ్ కూతురు అరుపులు వినిపించాయి. మీతో చిన్న పిల్లలు ఉన్నారా? అని పంకజ్‌ను అడిగాడు. అవునంటూ పంకజ్ సమాధానం చెప్పడంతో కంపెనీ సీఈఓ ఫుడ్ తీసుకునేందుకు కిందికి వెళ్లాడు. పంకజ్‌తో రేండేళ్ల చిన్నారిని చూసి ఎందుకు పాపను ఇలా తీసుకొచ్చావు అని ప్రశ్నించాడు. దీంతో అతను తన ఎమోషనల్ స్టోరీని పంచుకున్నాడు.
తన కూమార్తె బాగోగులు చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరని, అతని భార్య ప్రసవ సమయంలో చనిపోయిందని చెప్పాడు. అతని పెద్ద కొడుకు క్లాసెస్‌కి హాజరవుతాడాని, అందుకే ఫుడ్ డెలివరీ సమయంలో తన రేండేళ్ల చిన్నారిని తనతోపాటే తీసుకువెళ్తానని చెప్పుకొచ్చాడు. అతడి విచార కథను విన్న కంపెనీ సీఈఓ అగర్వాల్.. పంకజ్‌కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ, అతను డబ్బును తీసుకోవడానికి నిరాకరిస్తాడు. తనకు డబ్బు అవసరం లేదని, తన కూమార్తెను తాను చూసుకోగలనని చెప్పాడు.
పంకజ్ స్టోరీ తెలుసుకున్న అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పంకజ్ తన పసిబిడ్డతోనే వర్క్ చేస్తున్నాడని, ఎందుకంటే అతని కూమార్తెను చూసుకోవడానికి ఎవరూ లేరని, ఇలాంటి వారిపై సానుభూతి చూపాలి తప్ప తిట్టడం మంచిది కాదన్నారు. వీలైతే అలాంటి వారికి సహాయం చేయాలి కానీ తెలిసి తెలియకుండా మాటలతో బాధపెట్టడం కరెక్ట్ కాదన్నారు. తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో అంటూ పోస్ట్ చేశారు. భార్య బ్రతికి ఉండగానే మరో సంబంధం పెట్టుకుంటున్న రోజులివి. అలాంటిది పంకజ్ తన భార్య చనిపోయినా వేరే పెళ్లి చేసుకోకుండా తన కూతురి అలానా పాలనా చూసుకుంటూ స్విగ్గీ డెలివరీ చేయడం అందరి మనసులను కదిలించింది.
Also Read:
Palmistry: ఇలాంటి అరచేతులు ఉన్నవారు చాలా అదృష్టవంతులు..
Sensitive Skin Care Tips: మీ చర్మం సున్నితంగా ఉందా.. వేసవిలో ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి..
Health Tips: ఈ అలవాట్లు మీ రక్తపోటును పెంచుతాయి.. బీ కేర్ ఫుల్..