Stray Bull Attacks: రెచ్చిపోయిన ఎద్దు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని..
ABN , Publish Date - Jul 28 , 2025 | 02:40 PM
Stray Bull Attacks: ఆ ఎద్దు టీ షర్ట్ వేసుకున్న అమ్మాయిపై కూడా దాడి చేయడానికి చూసింది. ఆమె దాన్నుంచి తప్పించుకుని ఇంట్లోకి పారిపోయింది. ఆ ఎద్దు ఆ ఇంటికి చెందిన ముగ్గురు యువతులపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో వీధి జంతువులు జనంపై దాడులు చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. కుక్కలు, ఆవులు, ఎద్దులు ఇలా వీధిలో విచ్చల విడిగా తిరుగుతున్న జంతువులు.. రోడ్డుపై వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. ఆఖరికి ఇంటి బయట నిల్చున్న వారిని కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా, ఓ ఎద్దు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులపై దాడి చేసింది. ఓ అమ్మాయిని తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కత్నీ సిటీకి చెందిన ఓ యువతి ఇంటి బయట ఫోన్ మాట్లాడుతూ అటు, ఇటు తిరుగుతూ ఉంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కానీ, ఓ ఎద్దు ఇంటి దగ్గరకు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆ యువతి గేటు దగ్గరకు వచ్చి ఫోన్ చూసుకుంటూ ఉంది. అంతే.. ఆ ఎద్దు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి యువతిని కుమ్మింది. యువతి ఎగిరి నేలపై పడింది. తలకు బలంగా గాయం అవ్వటంతో పైకి లేవలేకపోయింది. యువతి అరుపు విని ఇంట్లోంచి టీషర్టు వేసుకున్న అమ్మాయి బయటకు వచ్చింది. కింద పడ్డ అమ్మాయిని లేపే ప్రయత్నం చేసింది.
ఆ ఎద్దు టీ షర్ట్ వేసుకున్న అమ్మాయిపై కూడా దాడి చేయడానికి చూసింది. ఆమె దాన్నుంచి తప్పించుకుని ఇంట్లోకి పారిపోయింది. ఆ ఎద్దు ఆ ఇంటికి చెందిన ముగ్గురు యువతులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి గురించి తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఆ నిధులు పక్కదారి పట్టించారు.. కేసీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్
టెన్త్ పాసైనవారికి గోల్డెన్ ఛాన్స్.. IBలో 4900లకు పైగా జాబ్స్..!