Sonu Sood Rescues Snake: సోనూసూద్ సాహసం.. ఒంటి చేత్తో పామును పట్టి..
ABN , Publish Date - Jul 20 , 2025 | 06:57 AM
Sonu Sood Rescues Snake: సోనూసూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఓ పాము వచ్చింది. ఈ విషయం ఆయనకు తెలిసింది. వెంటనే పాము ఉండే చోటుకు వెళ్లారు. అది విషం లేని పాము అని గుర్తించారు. దాన్ని చేత్తో పట్టుకుని ఓ సంచిలో వేశారు.

ప్రముఖ బహుభాషా నటుడు సోనూసూద్ మంచితనం గురించి అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో ఆయన ఎంతో మందికి సాయం చేశారు. ఇప్పటికీ కూడా అవసరం ఉన్న వాళ్లకు సాయం చేస్తూనే ఉన్నారు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు సేవా కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. సోనూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా, ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు.
ఆ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోలో సోనూ ఒంటి చేత్తో పామును పట్టుకున్నారు. ఇంతకీ ఆ పాము స్టోరీ ఏంటంటే.. శనివారం సోనూసూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఓ పాము వచ్చింది. ఈ విషయం ఆయనకు తెలిసింది. వెంటనే పాము ఉండే చోటుకు వెళ్లారు. అది విషం లేని పాము అని గుర్తించారు. దాన్ని చేత్తో పట్టుకుని ఓ సంచిలో వేశారు. తర్వాత దాన్ని దూరంగా తీసుకెళ్లి వదిలేశారు. సోనూ ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసి..
‘మా సొసైటీలోకి ఈ పాము వచ్చింది. ఈ పాము విషం లేనిది. కానీ, మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఉండే ప్రదేశాల్లోకి అప్పుడప్పుడు పాములు వస్తూ ఉంటాయి. పాములు పట్టే వాళ్లను పిలవండి. నాకు పాముల్ని పట్టడం కొంచెం కొంచెం వచ్చు. అందుకే పట్టుకున్నా. జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు పట్టే వాళ్లన కచ్చితంగా పిలవండి. నాలాగా ఎవ్వరూ చేయవద్దు’ అని రాసుకొచ్చారు. ఇక, ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
భారత్ పాక్ ఘర్షణలో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయి