Share News

Viral Video: పాముతో స్టంట్.. ఇది అస్సలు ఊహించలేదు..

ABN , Publish Date - Jun 15 , 2025 | 08:45 AM

Snake Bites Man: పాము తలను రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ పాము జీతూను కాటేసింది. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

Viral Video: పాముతో స్టంట్.. ఇది అస్సలు ఊహించలేదు..
Snake Bites Man

దేశంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఇండియన్ కామన్ క్రెయిట్ టాప్‌లో ఉంటుంది. దీన్నే మన తెలుగులో కట్ల పాము అంటారు. ఇండియాలో పాము కాటు కారణంగా చనిపోయే వారిలో సగానికి పైగా కట్ల పాము బాధితులే ఉన్నారు. నాగు పాము కంటే చాలా డేంజరస్ పాము ఇదే. నిద్రలో కట్ల పాము కరిస్తే.. నొప్పి లేకుండానే ప్రాణాలు పోతాయి. ఇంత ప్రమాదకరమైన కట్లపాముతో ఓ వ్యక్తి స్టంట్లు చేశాడు. జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.


ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, హైబాత్‌పూర్ గౌసన్ గ్రామానికి చెందిన జీతు ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లో లైన్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. గత శుక్రవారం అతడు ఓ కట్ల పామును పట్టుకున్నాడు. దాన్ని తన మెడకు చుట్టుకున్నాడు. ఊరి జనం మొత్తం అతడి చుట్టూ మూగారు. కొంతమంది వీడియో తీయటం మొదలెట్టారు. జనం చుట్టూ చేరటంతో జీతూ రెచ్చిపోయాడు. క్రేజీ స్టంట్లు చేయటం మొదలెట్టాడు.


పాము తలను రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ పాము జీతూను కాటేసింది. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. జీతూ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం జీతూ పామును ముద్దాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘పాములతో ఆటలు ఆడితే ఇలానే ఉంటుంది. చిన్న పామైనా సరే పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు ఊరికే చెప్పలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వరుస ప్రమాదాలు.. కాంతార షూటింగ్‌లో బోల్తాపడ్డ బోటు

పసిడి ప్రియులకు అలర్ట్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు

Updated Date - Jun 15 , 2025 | 08:45 AM