Share News

Plane Crashes Into Ocean: జనం చూస్తుండగానే సముద్రంలో కుప్పకూలిన మినీ విమానం

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:52 PM

Plane Crashes Into Ocean: విమానంలో సమస్య తలెత్తింది. పైలట్ విమానాన్ని ఓక్ ఐలాండ్ బీచ్ సమీపంలో సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాలని అనుకున్నాడు. అయితే, విమానం టప్ మని సముద్రంలో కుప్పకూలిపోయింది.

Plane Crashes Into Ocean: జనం చూస్తుండగానే సముద్రంలో కుప్పకూలిన మినీ విమానం
Plane Crashes Into Ocean

విమాన ప్రయాణాలంటే భయం పుడుతోంది. తరచుగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 కుప్పకూలిన తర్వాతినుంచి ఇప్పటి వరకు డజన్ కంటే ఎక్కువ విమాన ప్రమాదాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. శనివారం అమెరికాలో ఓ మినీ విమానం ప్రమాదానికి గురైంది. సముద్రంలో కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాలోని ఓక్ ఐలాండ్ సమీపంలో ఓ సింగిల్ ఇంజిన్ విమానం గాల్లో ఎగురుతూ ఉంది.


ఈ నేపథ్యంలోనే విమానంలో సమస్య తలెత్తింది. పైలట్ విమానాన్ని ఓక్ ఐలాండ్ బీచ్ సమీపంలో సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాలని అనుకున్నాడు. అయితే, విమానం టప్ మని సముద్రంలో కుప్పకూలిపోయింది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ‘ది ఓక్ ఐలాండ్ బీచ్ సేఫ్టీ యూనిట్’ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఒకరు మాత్రమే ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది ఆ ఒక్కడిని విమానం నుంచి బయటకు తెచ్చారు.


అతడికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యక్ష సాక్షుల మాటలు కూడా అందులో రికార్డు అయ్యాయి. ఇద్దరు అమ్మాయిలు బీచ్‌లో నిలుచుని ఉండగానే విమానం కుప్పకూలింది. దీంతో ఓ అమ్మాయి‘ఓరి దేవుడా.. విమానం సముద్రంలో కుప్పకూలింది. నీటిలోకి వెళ్లిపోతోంది’ అని అంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య విమానాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. విమానాలు ఎక్కాలంటేనే భయంగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కలకలం రేపుతున్న వన్యప్రాణుల వరుస మరణాలు

మార్నింగ్ వాక్‌లో మహిళా ఎంపీ.. మెడలో చైన్ కొట్టేసిన దొంగ..

Updated Date - Aug 04 , 2025 | 01:03 PM