Share News

Dating: డేటింగ్‌కు వెళ్లినందుకు చుక్కలు చూపించింది.. పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా ఏం చేసిందంటే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 09:23 PM

అమెరికాలోని ఫీనిక్స్ నగరానికి చెందిన జాక్వెలిన్ ఈడ్స్ అనే మహిళకు ఓ డేటింగ్ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం తర్వాత వారిద్దరూ డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ ఒకసారి నేరుగా కలుసుకున్నారు.

Dating: డేటింగ్‌కు వెళ్లినందుకు చుక్కలు చూపించింది.. పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా ఏం చేసిందంటే..
Dating

అమెరికా (America)లో ఓ మహిళ చేసిన పని చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే ఒక్కసారి డేటింగ్‌ (Dating)కు వచ్చిన అబ్బాయికి చుక్కలు చూపించింది. ఈమె ధాటికి తట్టుకోలేక ఆ అబ్బాయి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కూడా ఆమె తీరుకు ఆశ్చర్యపోయారు. అమెరికాలోని ఫీనిక్స్ నగరానికి చెందిన జాక్వెలిన్ ఈడ్స్ అనే మహిళకు ఓ డేటింగ్ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది (Viral News).


ఆ స్నేహం తర్వాత వారిద్దరూ డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ ఒకసారి నేరుగా కలుసుకున్నారు. ఆ తర్వాత జాక్వెలిన్‌ను ఆ వ్యక్తి కలుసుకోలేదు. అయితే జాక్వెలిన్ మాత్రం ఆ వ్యక్తిని వదల్లేదు. తొలి డేట్ తర్వాత పది నెలల కాలంలో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్‌కు ఏకంగా 1.59 లక్షల మెసేజ్‌లు పంపించింది. అతడు రిప్లై ఇవ్వకపోయినా జాక్వెలిన్ మాత్రం మెసేజ్‌లు చేస్తూనే ఉండేది. ఆ వ్యక్తి విదేశాలకు వెళ్లినపుడు అతడి ఇంట్లోకి ప్రవేశించి కొన్ని రోజులు గడిపింది.

dating2.jpg


స్నేహితులకు, ఆఫీస్‌లోనూ అతడి భార్యగా తనను తాను పరిచయం చేసుకుంది. ఆ వ్యక్తిని వేధించడం మొదలుపెట్టింది. చివరకు నేరుగా ఆ వ్యక్తి ఇంటికే వెళ్లిపోయింది. తన ఇంటి బయట జాక్వెలిన్ ఉండడం చూసిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఆమె కారులో ఓ కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్

పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 09:23 PM