Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్
ABN , Publish Date - Apr 26 , 2025 | 02:48 PM
Seema Haider: వీసాల రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ వెళుతుందా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ మేరకు సీమా హైదర్ తాజాగా ఓ వీడియోను సైతం విడుదల చేసింది. తనను ఇండియాలో ఉండనివ్వాలంటూ మోదీని, యోగీని ప్రాథేయపడుతోంది.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్థానీల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదలి వెళ్లిపోవాలంటూ రెండు రోజుల క్రితం విదేశీ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అందరి చూపు సీమా హైదర్ వైపు మళ్లింది. ప్రియుడి కోసం అక్రమంగా పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ప్రవేశించిన ఆమె.. వీసాల రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ వెళుతుందా? లేదా? అన్న చర్చ మొదలైంది. సీమా హైదర్‌కు కూడా పాకిస్తాన్ వెళ్లిపోవాల్సి వస్తుందేమోనన్న భయం పట్టుకుంది. అందుకే తనను ఇండియాలో ఉండనివ్వాలంటూ మోదీ, యోగీలను ప్రాథేయపడుతోంది.
ఈ మేరకు తాజాగా ఓ వీడియోను సైతం విడుదల చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోలో..‘ నేను పాకిస్తాన్ తిరిగి వెళ్లాలనుకోవటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్‌కు విజ్ణప్తి చేస్తున్నాను. నన్ను ఇండియాలోనే ఉండనివ్వండి. నేను ఒకప్పుడు పాకిస్తాన్ బిడ్డను. కానీ, ఇప్పుడు భారతదేశానికి కోడల్ని. ఇప్పుడు హిందూ మతాన్ని కూడా అనుచరిస్తున్నాను’ అని సీమా హైదర్ అంది. ఇక, సీమా హైదర్ ఇండియాలో ఉండటానికి వీలుందా? లేదా? అన్న దానిపై ఆమె లాయర్ ఏపీ సింగ్ స్పందించారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ..
‘ సీమా ఇప్పుడు పాకిస్తాన్ దేశస్తురాలు కాదు. ఆమె గ్రేటర్ నోయిడాకు చెందిన సచీన్ మీనాను పెళ్లి చేసుకుంది. కొద్దిరోజుల క్రితమే ఆమె ఓ కూతుర్ని కూడా కంది. ఆమె పౌరసత్వం భారత్‌కు చెందిన ఆమె భర్తతో ముడిపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం వీసాల రద్దు ఆదేశాలు ఆమెకు వర్తించవు’ అని స్పష్టం చేశారు. ఇక, సీమా లాయర్ చెప్పిన విషయాలతో చాలా మందికి ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఆయన చెబుతున్న దాని ప్రకారం ఒకరకంగా ఆమె ఇప్పుడు భారత పౌరురాలు.
ఇవి కూడా చదవండి
Daniel Vettori On SRH: కాటేరమ్మ కొడుకుల్లో ఒకడు తగ్గాడు అంటున్న కోచ్ వెటోరి
Viral Video On Tea: నీకేం పోయేకాలం తల్లీ.. టెంకాయ నీటిని ఇలా కూడా వాడుతారా..