SBI stairs demolished: ఎస్బీఐ మెట్లు మాయమయ్యాయి.. కస్టమర్లు బ్యాంక్‌కు ఎలా వెళ్తున్నారంటే..
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:38 PM
భద్రక్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మెట్లు అదృశ్యం కావడంతో సిబ్బంది, వినియోగదారులు బ్యాంక్ లోపలికి వెళ్లడానికి ఆపసోపాలు పడ్డారు. భద్రక్ జిల్లాలో అధికారులు ఆక్రమణల కూల్చివేత చర్యలు చేపడుతున్నారు.
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భద్రక్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మెట్లు అదృశ్యం కావడంతో సిబ్బంది, వినియోగదారులు బ్యాంక్ లోపలికి వెళ్లడానికి ఆపసోపాలు పడ్డారు. భద్రక్ జిల్లాలో అధికారులు ఆక్రమణల కూల్చివేత చర్యలు చేపడుతున్నారు. ఆ క్రమంలో ఎస్బీఐ కార్యాలయం ఉన్న భవంతి మెట్లు కూల్చేశారు (SBI bank demolition drive).
ఆ భవంతి మొదటి ఫ్లోర్‌లో ఎస్బీఐ కార్యాలయం ఉంది. మెట్లు కూల్చివేసిన తర్వాత మొదటి అంతస్తులో ఉన్న ఆ శాఖకు ప్రవేశ ద్వారం లేకుండా పోయింది. దీంతో బ్యాంకింగ్ సేవలను పొందడానికి వినియోగదారులు ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చిన నిచ్చెన ఎక్కాల్సి వచ్చింది. ప్రజలు నిచ్చెన ఎక్కుతుండగా, ఒక సెక్యూరిటీ గార్డు, మరొక వ్యక్తి వారికి సహాయం చేస్తున్నారు. చరంప మార్కెట్ నుంచి భద్రక్ రైల్వే స్టేషన్ వరకు తొలగింపు ఆపరేషన్‌ను నవంబర్ 20, 21 తేదీల్లో చేపట్టారు (SBI branch access issue).
ఈ ఘటనపై పట్టణ మున్సిపల్ అధికారులు స్పందించారు. అనేక సార్లు బహిరంగ ప్రకటనలు జారీ చేశామని, ఆక్రమణదారులు ఖాళీ చేయడానికి రెండు రోజుల సమయం ఇచ్చామని చెప్పారు. చాలా మంది దుకాణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించారని పేర్కొన్నారు. కానీ, ఎస్బీఐ ఉన్న భవనం యజమానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని, అందుకే కూల్చేశామని తెలిపారు (demolition removes stairs).
కూల్చివేత తర్వాత, సోమవారం నుంచి సిబ్బంది, కస్టమర్లు బ్యాంక్‌కు చేరుకోవడానికి నిచ్చెనను ఏర్పాటు చేశారు (unusual banking incident). అత్యవసర బ్యాంకింగ్ సేవల కోసం వచ్చిన కస్టమర్లు ఈ నిచ్చెనను ఎక్కాల్సి వచ్చింది. అయితే, ప్రజల ఆగ్రహం నేపథ్యంలో, భవన యజమాని బుధవారం స్టీల్ మెట్లను ఏర్పాటు చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది, వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. సింహాలు కూడా ఇంతలా భయపడతాయా.. నది ఒడ్డున ఏం జరిగిందో చూడండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 888ల మధ్య 808 ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..